Health Tips : నెల రోజులపాటు టీ తాగడం మానేస్తే ఏమవుతుందో తెలుసా..?

Published : Jul 27, 2025, 09:55 AM IST

చాలామందికి ఉదయాన్నే టీ తాగకపోతే ఏమి తోచదు. ఒక కప్పు టీ తాగాకే చాలామంది రోజూవారి పనులను ప్రారంభిస్తారు. అయితే నెల రోజుల పాటు టీ తాగడం మానేస్తే శరీరంలో మంచి మార్పులు వస్తాయట. అవేంటో ఇక్కడ చూద్దాం.  

PREV
17
నెల రోజులు టీ తాగడం మానేస్తే..

మనలో చాలా మందికి ఉదయం లేవగానే టీ తాగే అలవాటు ఉంటుంది. కొంతమంది పని మధ్యలో టీ తాగితే ఒత్తిడి తగ్గుతుందంటారు. మరికొందరు టీ తాగితే తలనొప్పి తగ్గుతుందని చెబుతుంటారు. టీ తాగడానికి ఒక్కొక్కరికి ఒక్కో కారణం ఉంటుంది.

27
టీ మానేస్తే శరీరంలో కలిగే మార్పులు

ఎక్కువ టీ తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని వైద్యులు చెబుతుంటారు. ఎక్కువ టీ తాగడం వల్ల కలిగే ప్రమాదం తెలిసినా చాలామంది ఈ అలవాటును మానుకోరు. అయితే 30 రోజులు టీ తాగడం మానేస్తే శరీరంలో ఏం మార్పులు కనిపిస్తాయో ఇక్కడ తెలుసుకుందాం.  

37
మూత్ర సంబంధిత సమస్యలు తగ్గుతాయి..

దాదాపు ఒక నెల పాటు టీ తాగడం మానేస్తే శరీరంలో మంచి మార్పులు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. 30 రోజులు టీ తాగకపోతే శరీరంలో కెఫిన్ తగ్గుతుంది. దానివల్ల మూత్ర సంబంధిత సమస్యలు తగ్గుతాయట.

47
మంచి నిద్ర

టీ తాగితే ప్రశాంతంగా ఉంటుందని మనం వింటూ ఉంటాం. కానీ టీ తాగడం మానేస్తే మంచిగా నిద్ర పడుతుంది. గాఢ నిద్ర వల్ల శరీరం, మనసు ప్రశాంతంగా ఉంటాయి. దానివల్ల మానసిక ఒత్తిడి తగ్గి ఉత్సాహంగా ఉండచ్చు.

57
టీ తాగకపోతే..

టీ తాగకపోతే అలసట, తలనొప్పి, పనిలో శ్రద్ధ తగ్గుతుందని చాలామంది అంటుంటారు. కానీ ఇది కొన్ని రోజులకే పరిమితం. మీ శరీరం టీ లేని వాతావరణానికి అలవాటు పడితే అలాంటి సమస్యలేవీ రావని నిపుణులు చెబుతున్నారు.

67
టీకి బదులు

పాల టీకి బదులుగా హెర్బల్, గ్రీన్ టీ తాగచ్చు. ఈ పానీయాలు ఆరోగ్యానికి మంచివి. టీ కి బదులుగా వేడి నీళ్లలో నిమ్మరసం కలిపి తాగితే శరీరంలోని కెఫిన్ తొలగిపోతుంది.

77
ఆరోగ్య సమస్యలు ఉన్నవారు..

కొంతమంది ఆరోగ్య సమస్యల వల్ల టీ తాగడం మానేస్తారు. టీ లేదా కాఫీ ఆరోగ్యకరమైన పానీయాలు కావని చెబుతారు. అజీర్తి వంటి కడుపు సంబంధిత సమస్యలు ఉన్నవారు, గర్భిణులు, బాలింతలు టీ తాగవద్దని నిపుణులు సూచిస్తున్నారు.  

Read more Photos on
click me!

Recommended Stories