Health Tips: షుగర్ పేషెంట్లు అస్సలు తాగకూడని డ్రింక్స్ ఇవే.. తాగారో ఇక అంతే సంగతులు!

Published : Oct 03, 2025, 03:36 PM IST

షుగర్ పేషెంట్లు తినే, తాగే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పదార్థాలు, డ్రింక్స్ షుగర్ లెవెల్స్ ని అమాంతం పెరిగేలా చేస్తాయి. దానివల్ల చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా జరగకూడదంటే డయాబెటిస్ ఉన్నవారు ఈ డ్రింక్స్ అస్సలు తాగకూడదు.

PREV
14
Worst Drinks for Diabetics

ఈ రోజుల్లో షుగర్ పేషెంట్లు లేని ఇల్లు లేదు. చెడు ఆహారపు అలవాట్లు, గజిబిజి లైఫ్ స్టైల్, ఒత్తిడి ఇతర కారణాల వల్ల చాలామంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరిలో ఈ వ్యాధి కనిపిస్తోంది. నిపుణుల ప్రకారం ఒక్కసారి షుగర్ వ్యాధి వస్తే.. దాన్ని పూర్తిగా నివారించలేము కానీ… సరైన ఫుడ్ హ్యాబిట్స్, హెల్తీ లైఫ్ స్టైల్ వంటివి పాటించడం ద్వారా షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. అందుకే డయాబెటిక్ పేషెంట్లు తమ ఆహారంపై కచ్చితంగా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని వైద్యులు చెబుతుంటారు. 

ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ఫుడ్ కానీ డ్రింక్స్ కానీ అస్సలు తీసుకోవద్దని చెబుతుంటారు వైద్యులు. ఈ డ్రింక్స్ రక్తంలో చక్కెర స్థాయిలను రాకెట్ వేగంతో పెంచేస్తాయట. అలాంటి కొన్ని డ్రింక్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం. 

24
ఆరెంజ్ జ్యూస్

నారింజ పండు ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ దాని జ్యూస్ రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఆరెంజ్ జ్యూస్‌లో చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఇది డయాబెటిస్ ఉన్నవారికి చాలా హానికరం. కావాలంటే షుగర్ పేషెంట్లు నారింజ పండును తినవచ్చు. ఈ పండులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

34
దానిమ్మ జ్యూస్

దానిమ్మ పండులో విటమిన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దానిమ్మ రసం ఆరోగ్యానికి మంచిదే అయినా.. షుగర్ ఉన్నవారికి అస్సలు మంచిది కాదు. కాబట్టి డయాబెటిస్ పేషెంట్లు దానిమ్మ రసం తాగడానికి బదులు పండుగా తినడం మంచిది. అది కూడా మితంగా తినవచ్చు. దానిమ్మ గింజలు తినడం ద్వారా జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. పొట్ట సంబంధిత సమస్యలు దూరమవుతాయి. 

44
ద్రాక్షరసం

ద్రాక్ష చాలా రుచిగా ఉంటుంది. కాబట్టి చాలా మంది వీటిని ఇష్టపడతారు. ద్రాక్షలో ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉన్నప్పటికీ డయాబెటిస్ ఉన్నవారికి ద్రాక్ష రసం మంచిది కాదు. ఎందుకంటే ఇందులో చక్కెర శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతుంది. కాబట్టి ద్రాక్షరసం షుగర్ పేషెంట్లకు మేలు కంటే కీడే ఎక్కువ చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. పండ్ల రసాలు మాత్రమే కాదు.. కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ వంటి వాటికి కూడా షుగర్ పేషెంట్లు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. 

గమనిక

ఈ కథనం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories