
1. రోషన్ ! కాలిఫోర్నియా లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ! ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాడు . క్రిస్మస్ సెలవుల్లో ఇండియా కి వెళ్ళడానికి ప్లాన్ చేసుకొన్నాడు . ఇంకా వర్క్ టార్గెట్ మిగిలే ఉంది. డిన్నర్ చేసి లాప్టాప్ తో పని మొదలెట్టాడు . నీరసంగా ఉంది. తల నొప్పి. లాప్ టాప్ పక్కన బెట్టి టీవీ ఆన్ చేసాడు. విస్కీ బాటిల్ తీసాడు. మూడు పెగ్గులేసాడు. కాసేపటికి నిద్ర పట్టేసింది. తెల్లవారు జామున జామున అయిదు.. నిద్ర ఇంకా వస్తున్నా... యూరిన్ ఒత్తిడి ఎక్కువ కావడంతో లేచి నేరుగా బాత్ రూమ్ కు వెళ్ళాడు. కమోడ్ పై ప్రాణం వదిలాడు . డాక్టర్స్ గుండెపోటు అని తేల్చారు.
2. రాగిణి ! ఢిల్లీ లో తన ఫ్లాట్ లో ఉంది. తన బాయ్ ఫ్రెండ్ చేసిన మోసాన్ని పదేపదే తలచుకొంటోంది. " ఇంత మోసమా? తనకే ఇలా ఎందుకు జరగాలి? కాలేజీ రోజుల్లో ఒకడు.. ఇప్పుడు ఆఫీస్ కొలీగ్. వరుసగా ఇద్దరితో బ్రేక్ అప్. "ఫ్రిజ్ లోని బకార్డి బ్రిజర్ తీసింది. ఒకదాని తరువాత ఒకటి మొత్తం నాలుగు బాటిల్స్ ఖాళీ. కాసేపటికి ఆమె శరీరం ఫ్యాన్ కు వేలాడుతూ. పొద్దున్న పోలీసులు ఆత్మహత్య అని తేల్చేసారు.
3. రాంనారాయణ్! మాదాపూర్ లో ఉండేవాడు.. తనకు ఎన్నో ఏళ్లుగా ఆస్తమా. వారం రోజులుగా ఇది బాగా ముదిరింది. ఆసుపత్రిలో అడ్మిట్ కావాల్సి వచ్చింది. నిమోనియా వచ్చిందని డాక్టర్స్ చికిత్స మొదలెట్టారు. ఆక్సిజన్ సాచురేషన్ నలబైకి పడిపోయింది . కాసేపట్లోనే శవంగా డిశ్చార్జ్.
ఊర్లు వేరు ..
మనుషులు వేరు !
పై మూడు ఘటనలు జరిగింది ఒకటే రోజు!
డిసెంబర్ 13 !
మీకు పెద్దగా తెలియని నిశబ్ద హంతకిని పరిచయం చేస్తాను.. రండి.
పైపైగా ఈ పోస్ట్ చూడొద్దు. వాట్సాప్ లో సోషల్ మీడియా లో చెత్త చదివి.. చూసి చూసి చదివే ఓపిక తగ్గిపోతే నా పోస్ట్ ల జోలికి రాకండి. నిజంగా తెలుసుకోవాలి అంటే మాత్రం శ్రద్ధగా ఒకటి రెండు సార్లు చదవండి!
మీకందరికీ వడ దెబ్బ గురించి తెలుసు. సమ్మర్ లో ఎండలో తిరిగితే ఒంటినుండి నీరు చెమట రూపం లో ఆవిరిగా వెళ్ళిపోతే చివరకు చావుకొస్తుంది.
ఇది అలాంటిదే!
కాదు కాదు .. అంత కన్నా వంద రెట్లు ప్రమాదకరం !
సమ్మర్ స్ట్రోక్ .. తెలుగు సినిమాల్లో హీరో లాగా సౌండ్ చేస్తూ చంపుతుంది. ముందుగా హెచ్చరిస్తుంది.
ఇప్పుడు నేను చెప్పబోయే వింటర్ స్ట్రోక్.. రాజకీయ నాయకులకంటే ప్రమాదం. ఎవరికీ అనుమానం రాకుండా , ఎలాంటి హెచ్చరికలు లేకుండా సైలెంట్ గా చంపేస్తుంది. ఇంకా చెప్పాలంటే తడి గుడ్డతో మెళ్లిగా గొంతుకోస్తుంది. ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాల రావు లాంటిది. తస్మాత్ జాగ్రత్త!
నవంబర్ -డిసెంబర్- జనవరి నెలలు శీతాకాలం!
గాలిలో తేమ తక్కువ! ముఖ్యంగా ఇండోర్స్ లో హ్యూమిడిటీ బాగా తక్కువ!
దీని వల్ల మన శరీరంలోని నీరు బయటకు పోయి డీహైడ్రేషన్ కు గురి అవుతాము. సమ్మర్ డీ హైడ్రేషన్ వల్ల దాహం వేస్తుంది . వింటర్ లో చలి వల్ల దాహం వెయ్యదు.
డీ హైడ్రేషన్ వల్ల శరీరం లో హిస్టమిన్ ఎక్కువ పుడుతుంది. అలాగే వాసోప్రెస్సిన్ కూడా . ఇది మహిళల్లో మరింత ప్రమాదకరం. కారణం ఈస్ట్రోజెన్.
1. డీ హైడ్రేషన్ వల్ల చర్మం .. నాలుక డ్రై గా మారిపోతాయి . రెంటి పై పగుళ్లు వచ్చే అవకాశం .
2. పొడి గాలి వల్ల ఆస్తమా, బ్రాంకైటిస్ .. అవి తీవ్రమై CPOD , నిమోనియా వచ్చే ప్రమాదం.
3. డీ హైడ్రేషన్ వల్ల తలనొప్పి , నీరసం, మెదడు చురుకు తనం తగ్గిపోతుంది .
4. కిడ్నీ లో రాళ్లు ఏర్పడే ప్రమాదం .
అంతేనా? కాదు కాదు... నిర్జలీకరణం దారుణ హంతకి.
చదవండి.
5. రక్తం చిక్కబడి పోతుంది. అందులో క్లాట్స్ ఏర్పడుతాయి.
6. బిపి పెరిగే ప్రమాదం. దీని వల్ల గుండెపోటు.. మెదడు పోటు.
7. ఇమ్మ్యూనిటీ దెబ్బ తిని అంటు రోగాలు సులభంగా సోకుతాయి . వస్తే ఒక పట్టాన వదలవు.
8. డీహైడ్రేషన్... సెరిటోనిన్- డోపమైన్ హార్మోన్స్ సమతులన్నీ దెబ్బతీస్తుంది. దీంతో సులభంగా డిప్రెషన్ కు గురవుతారు.
9. మెదడు చురుకుతనం కోల్పోతుంది. ఏకాగ్రత తగ్గుతుంది . జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది.
10 . సాడ్ అనే ఒక మానసిక రోగం వస్తుంది. ఇలాంటి వారు ఆత్మహత్యలు చేసుకొనే ప్రమాదం.
అగ్గి లో పెట్రోల్!
అసలే వింటర్ . చలి వల్ల డీ హైడ్రేషన్ . దానికి తోడు ..
1. డి విటమిన్ లోపం .
మనకు ఇండియా లో ఫరవా లేదు . ఎండ వస్తుంది . అమెరికా లాంటి దేశాల్లో పదింటికి కానీ పొద్దు పుట్టదు. నాలుగింటికి పొద్దు పోతుంది. చర్మానికి సూర్య రశ్మి సోకే అవకాశం తక్కువ . దీని వల్ల డిప్రెషన్ ఎక్కువవుతుంది . సిరికార్డయిన్ రిధం దెబ్బ తినడం వల్ల ఎనర్జీ లెవెల్స్ దెబ్బ తింటాయి . నిద్ర పట్టదు.
2. తెల్లన్నం, బ్రెడ్, మైదా నాన్ లు బాగా తినాలి అనిపిస్తుంది. మా తాతలు తిన్నాడులే అని తెగతింటారు. బరువు పెరుగుతారు . ఈ విధంగా కూడా బిపి ప్రమాదం.
3. టీవీ లు .. మొబైల్స్ .. లాప్ టాప్ !
అసలే చలికాలం . బయటకు పొయ్యే ఓపిక ఉండదు . ఇంట్లో కూర్చుని మొబైల్ పరికరాలతో కాలక్షేపం . అందులోనుంచి వచ్చే బ్లూ లైట్ . దీని వల్ల శరీరం లో తగినంత నిద్ర హార్మోన్ ఉత్పత్తి కాదు . దీనితో నిద్ర పట్టదు . ఎక్కువ సేపు ఇండోర్స్ లో ఉండడం వల్ల డీ హైడ్రేషన్ .
4. "తాగితే మరచిపోగలను .. మరచి పొతే తాగగలను .. "పాట బాగుంటుంది కానీ తాగే వారు ఒక విషయం మరచిపోకూడదు . మద్యం శరీరాన్నుండి నీటిని తోడేస్తుంది. అందుకే హ్యాంగ్ ఓవర్ లో నాలుక పిడుచ .. తలనొప్పి .
ఒకసారి పోస్ట్ మొదటి పార్ట్ లోకి వెళదాము.
1. రోషన్ .. అసలే అమెరికా ..డిసెంబర్ లో చలి. ఆఫీస్ .. అటు పై ఇల్లు .. ఇండోర్స్. అదే పనిగా ఆఫీస్ లో అటుపై ఇంట్లో బ్లూ లైట్ . దానికి తోడు డ్రింక్స్. నిద్ర నుంచి లేచి నేరుగా టాయిలెట్ కు వెళ్ళాడు. శరీరం లో నీరు మొత్తం ఆవిరి. గుండెపోటు రాదా?
2. రాగిణిది డిప్రెషన్ . దీనికి తోడు మద్యం . అసలే ఈస్ట్రోజెన్ ఎక్కువ బాడీ .. మహిళ కదా ? సీజనల్ అఫక్టీవ్ డిసార్డర్ . ఆత్మహత్య .
3. రాంనారాయణ .. పొల్యూషన్ .. పైగా చలికాలం .. డీ హైడ్రేషన్ . పాపం .. ఊపిరితిత్తుల సమస్య తీవ్రమై పోయాడు .
పోస్ట్ సేవ్ చేసుకోండి .
నన్ను శాడిస్ట్ అనుకొన్నా ఫరవాలేదు . చూడండి ఈ చలికాలంలో ఎన్ని గుండె పోట్లు.. మెదడు పోట్లు .. ఆత్మహత్యలు .. ఊపిరి తిత్తుల వ్యాధులో...
వాడు చచ్చాక పేస్ బుక్ తేరగా దొరికింది కదా అని" అయ్యో ... కుయ్యో .. పోయావా" .. అని పోస్ట్లు పెట్టడం కన్నా .. ఇప్పుడే ఇది చెప్పండి . మీకు తెలిసినవారికి ..
మీరు కూడా పాటించండి .
1. వింటర్ లో కొలత వేసుకొని నీరు తాగాలి . మహిళలు మూడు లీటర్లు .. పురుషులు నాలుగు .. చుక్క తగ్గొద్దు.
2. ఎండలో నడవండి . కుదరకపోతే డి విటమిన్ మాత్రలు తీసుకోండి .
3. మొబైల్ పై రీల్స్ స్మార్ట్ టీవీ పై ఓటిటి చెత్త చూడొద్దు . మొబైల్ లాప్ టాప్ కేవలం ఆఫీస్ పనులకే . అది కూడా పరిమితం చేసుకోండి .
4. మందు తాగొద్దు . తాగాలి అనుకొంటే రాళ్లపై అసలు వద్దు . ఏంటి రాళ్లు? అనుకొంటున్నారా ? తాగుపోతులకు ఆ విషయం తెలుసులెండి .మీకెందుకు ?
5. తాగి పడుకొని లేచాక .. ఆ మాటకు వస్తే .. తాగకుండా పడుకున్నా లేచాక .. వెంటనే బాత్ రూమ్ కు పరుగెత్తొద్దు. లేచి మంచంపై రెండు నిమషాలు కూర్చోండి . కాళ్ళు.. నేలకు ఆనించాలి . కాస్త మెల్లగా పాదాలతో ఫ్లోర్ ను తన్నాలి. ఇదే సమయంలో మీరు న్యూరో లింగిస్టిక్ అఫ్ఫార్మేషన్ కూడా చదవొచ్చు . లేదా దైవ ప్రార్ధన . రెండు నిముషాల తరువాత బాత్ రూమ్ .
5. అటు పై కనీసం అర లీటర్ తాగాలి . బాత్ రూమ్ కెళ్లే ముందు నీరు తాగినా మంచిదే . ముక్కాలా ముక్కాలా అనే పాట పాడకుండా అక్కడ పనై పోతుంది
లైఫ్ చాలా సింపుల్ .
తక్కువ స్థాయిలో కార్బ్స్.. కాంప్లెక్స్ కార్బ్స్ .
ఎక్కువ ప్రోటీన్ .
తగినంత నీరు .
ఎండ
భౌతిక శ్రమ
పని .. ఇల్లు ..
అంతే .
"అదే మేజిక్ ! "
దీన్ని వదిలేసి..
ఏదో.. ఏదో చేస్తూ..
"అందులో తప్పేముంది ? అది ఆర్టు..." అని వాదిస్తూ ఎంతో మంది జీవితాన్ని నిరంజన్ గారి లాగ తగలెట్టేసుకుంటుంటారు !
"ఒరేయ్ .. చారి .. జనాలకు ఈ పోస్ట్ ను షేర్ చెయ్యమని చెప్పరా! "
శుభోదయం!