కాల్షియం:
మన శరీరంలో ఎముకల దృఢత్వానికి గుండె పనితీరుకు కండరాల ఆరోగ్యానికి కాల్షియం ఎంతో అవసరం అవుతుంది. ఎప్పుడైతే క్యాల్షియం లోపిస్తుందో ఆ సమయంలో గుండె జబ్బుల బారిన పడటం లేదా శరీరంలో ఎముకలు పట్టుత్వాన్ని కోల్పోయి తొందరగా పెలుసు బారడం జరుగుతుంది. అందుకే క్యాల్షియం ఎక్కువగా కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవాలి. కాల్షియం ఎక్కువగా పాలు, బెండకాయ, చీజ్ ,చికెన్, చేపలు, పాలకూర వంటి ఆహార పదార్థాలలో అధికంగా లభిస్తుంది.