అధిక శరీర బరువుతో బాధపడుతున్నారా.. తగ్గించే పానీయాలు ఇవే?

First Published Nov 9, 2022, 1:38 PM IST

ప్రస్తుత కాలంలో అధిక పని ఒత్తిడి కారణంగా మన శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఇలా శరీరంలో మార్పులు కారణంగా చాలామంది అధిక శరీర బరువు పెరగడానికి కారణం అవుతున్నారు. ఒకవైపు పని ఒత్తిడి మరోవైపు మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుకూలంగా ఎంతోమంది అధిక శరీర బరువు సమస్యతో బాధపడుతున్నారు.అయితే ఇలా అధిక శరీర బరువుతో బాధపడేవారు బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు అయితే ఇలా బరువు తగ్గాలనుకున్నవారు ఈ పానీయాలు సేవిస్తే చాలు...
 

చాలామంది అధిక శరీర బరువుతో బాధపడుతూ ఎక్కువగా వ్యాయామాలు చేయడం వర్కౌట్లు చేయడం చేస్తూనే మరోవైపు కఠినమైన డైట్ ఫాలో అవుతుంటారు. ఈ విధంగా శరీర బరువు తగ్గడం కోసం శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్న వారు ప్రతి రోజు ఈ పానీయాలు కనుక సేవిస్తే తప్పనిసరిగా శరీర బరువు తగ్గుతారు. మరి ఆ పానీయాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం...
 

ఆయుర్వేదం ప్రకారం శరీర బరువు తగ్గడానికి నిమ్మరసం ఎంతగానో దోహదపడుతుంది నిమ్మరసంలో విటమిన్ సి తో పాటు పాలిఫినాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీర బరువును తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయి.నిమ్మరసం మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాలను తగ్గించే మంచి కొలెస్ట్రాల్ ను మెరుగుపరచడంలో దోహదపడుతుంది. ఇకపోతే మన శరీరంలో వ్యాధికారకాలను కలిగించే ఫ్రీ రాడికల్స్ ని కూడా శరీరం నుంచి బయటకు తొలగింప చేస్తుంది.

ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ నిమ్మరసం మరొక స్పూన్ చక్కర లేదా తేనె కలుపుకొని తాగటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు ముఖ్యంగా అధిక శరీర బరువుతో బాధపడేవారు ప్రతిరోజు పరగడుపున ఇలా ఈ పానీయం తాగటం వల్ల శరీరం బరువు అమాంతం తగ్గిపోతారు. ఇక చక్కెరకు బదులు బెల్లం వేసుకుని తాగాలనుకునేవారు బెల్లం కూడా ఉపయోగించవచ్చు.
 

బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు ఎంతో పుష్కలంగా లభిస్తాయి.ఇందులో ఉండేటటువంటి జింక్ సెలీనియం పుష్కలంగా అందడంతో మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి కీలకపాత్ర పోషిస్తాయి. అదేవిధంగా మన శరీరంలో మెటబాలిజం పెంచి శరీరంలో పేరుకుపోయిన క్యాలరీలను కరిగించడానికి దోహదం చేస్తుంది.అందుకే ప్రతిరోజు ఉదయం ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలోకి కొద్దిగా బెల్లం ముక్క వేసి ఆ బెల్లం ముక్క కరిగే వరకు కలియబెడుతూ కాస్త నిమ్మరసం కలుపుకొని సేవించాలి.
 

ఈ విధంగా ప్రతిరోజు ఉదయం తాగటం వల్ల మన శరీరంలో జీవక్రియలు మెరుగుపడటమే కాకుండా శరీర బరువును తగ్గడంలో కూడా దోహదపడుతుంది. ఇకపోతే సువాసన ప్రెష్ నెస్ కోసం ఈ పానీయంలోకి రెండు పుదీనా ఆకులు కలుపుకోవడం కూడా మంచిది.

click me!