పిల్లలు ఎక్కువగా తీపి పదార్థాలు తినడానికి ఇష్టపడుతున్నారా.. ఇది తెలుసుకోవాల్సిందే?

First Published Nov 8, 2022, 3:59 PM IST

సాధారణంగా చిన్నపిల్లలు ఎక్కువగా తీపి పదార్థాలను తినడానికి ఇష్టపడతారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున చాక్లెట్ స్వీట్స్ తింటూ ఉంటారు. ఇలా చిన్న పిల్లలు ఎక్కువగా తీపి పదార్థాలు కనుక తింటూ ఉంటే భవిష్యత్తులో వారికి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. మరి పిల్లలు తీపి పదార్థాలను ఎక్కువగా తినడం వల్ల ఏం జరుగుతుంది అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. 
 

పంచదార పిల్లలను పూర్తిగా తనకు బానిసలుగా మార్చేసుకుంటుంది. ఈ క్రమంలోనే చక్కెరకు అలవాటు పడిన పిల్లలు తీపి పదార్థాలు తినడానికి కూడా అలవాటు పడతారు ఇలా పెద్ద ఎత్తున చాక్లెట్స్ స్వీట్స్ వంటి వాటిని తినడానికి ఆసక్తి చూపిస్తారు.ఈ విధంగా చాక్లెట్లు ఇతర తీపి పదార్థాలలో ఉపయోగించే చెక్కరను ఎక్కువగా ప్రాసెస్ చేయడం వల్ల పిల్లలు భవిష్యత్తులో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
 

అయితే మనకు లభించే చక్కెరను వివిధ రకాలుగా ఉంటాయి. ప్రక్టోస్ అనే చక్కరలను పండ్ల నుంచి సేకరించగా మాల్టోస్ అనే చెక్కరలను పులియపెట్టిన ధాన్యాల నుంచి సేకరిస్తారు. అలాగే లాక్టోస్ పాల నుంచి, గ్లూకోజ్ పండ్లు కూరగాయల నుంచి సేకరిస్తారు అయితే మన శరీరంలో రక్తంలో గ్లూకోస్ ఎక్కువగా ఉంటుంది. ఇకపోతే తీపి పదార్థాలను తయారు చేసే సమయంలో తయారీ సంస్థలు ఎక్కువగా రిఫండ్ చేయడం వల్ల అవి సుక్రోజ్ గా మారుతాయి. అయితే పిల్లలు తినే ఈ తీపి పదార్థాలలో సుక్రోజ్ అధికంగా ఉంటుంది.
 

సుక్రోజ్ మత్తు పదార్థంగా ఉంటుంది కనుక పిల్లలు ఎక్కువగా తీపి పదార్థాలకు బానిసలు అవుతూ ఉంటారు. ఇక టెక్నాలజీ పెరగడంతో ల్యాబ్ లో పండించిన కృత్రిమ గింజల ద్వారా చక్కెరను తీస్తారు దీనిని ఎక్కువగా కూల్ డ్రింక్స్ లో ఉపయోగిస్తారు. ఈ చక్కెరలను హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ అంటారు. కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగే వారిలో ఈ షుగర్ కారణంగా శరీరంలో ఎక్కువ శాతం కొవ్వు పేరుకు పోతుంది.
 

ఇలా రకరకాల చక్కరలు పిల్లల శరీరంలోకి ప్రవేశించడం వల్ల ఇవి పిల్లలలో రోగ నిరోధక శక్తి పై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. పిల్లలలో సరైన ఏకాగ్రత లేకపోవడం, దంతాలు లోపించడం, తరచూ కడుపులో నొప్పిని భరిస్తూ ఉంటారు. ఇక తీపి పదార్థాలను ఎక్కువగా తినడం వల్ల అతి చిన్న వయసులోనే పిల్లలు కూడా డయాబెటిస్ బారిన పడుతున్నారు.
 

ఇకపోతే తీపి ఎక్కువగా తినే పిల్లలు తొందరగా ఆస్తమాకు గురవుతారని స్విజర్లాండ్ లో జరిపిన తాజా పరిశోధనలలో వెల్లడైంది. ఈ విధమైనటువంటి చక్కెరలను ఎక్కువగా తీసుకోవడం వల్ల పిల్లలలో కఫం ఏర్పడి అది ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందికరంగా మారి ఆస్తమాకు దారితీస్తుంది.అందుకే పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వీలైనంతవరకు సాఫ్ట్ డ్రింక్స్ చాక్లెట్స్ ఇతర తీపి పదార్థాలను పూర్తిగా అవాయిడ్ చేయడం ఎంతో మంచిది.

click me!