చన్నీళ్లు vs వేడినీళ్లు.. చలికాలంలో ఏ నీళ్లతో స్నానం చేయడం మంచిది?

Published : Nov 12, 2025, 06:02 PM IST

చలికాలంలో వైరస్‌లు, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు వేగంగా వ్యాపిస్తాయి. కాబట్టి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ముఖ్యంగా స్నానం కచ్చితంగా చేయాలి. అయితే చలికాలంలో వేడినీళ్ల స్నానం మంచిదా? చన్నీళ్ల స్నానం మంచిదా? నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూద్దాం. 

PREV
15
Winter Bathing Tips

చలికాలం వచ్చిందంటే చాలు.. చాలామంది స్నానం చేయడానికి ఇష్టపడరు. ఉదయం చల్లగా ఉంటుంది కాబట్టి చన్నీళ్లతో కంటే వేడి నీళ్లతో స్నానం చేయడానికే ఎక్కువగా మొగ్గు చూపుతారు. కానీ ఆరోగ్య పరంగా ఏది మంచిది? చలికాలంలో వేడి నీళ్ల స్నానం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందా? లేక చన్నీళ్ల స్నానం వల్ల మంచి జరుగుతుందా? ఈ ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. నిజానికి రెండింటికీ ప్రత్యేకమైన ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

25
వేడి నీళ్ల స్నానం వల్ల కలిగే ప్రయోజనాలు

చలికాలంలో వేడి నీటితో స్నానం చేస్తే హాయిగా అనిపిస్తుంది. వేడి నీరు చర్మంపై రంధ్రాలను తెరిచి, దుమ్ము, చెమటను శుభ్రం చేస్తుంది. అదే విధంగా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. కండరాల నొప్పులను తగ్గిస్తుంది. రోజంతా పనితో అలసిపోయినప్పుడు వేడి నీళ్ల స్నానం శరీరాన్ని, మనసును రిలాక్స్ చేస్తుంది. చలి వాతావరణంలో శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.

అయితే ఎక్కువ వేడిగా ఉన్న నీటితో తరచుగా స్నానం చేయడం చర్మానికి హానికరం కావచ్చు. ఎందుకంటే వేడి నీరు చర్మంలోని సహజ నూనెను తొలగిస్తుంది. దాంతో చర్మం పొడిబారి దురద, దద్దుర్లు రావచ్చు. ప్రత్యేకంగా సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు ఎక్కువ వేడి నీరు వాడకూడదు. 

35
చన్నీళ్ల స్నానం వల్ల కలిగే ప్రయోజనాలు

చలికాలంలో చన్నీళ్ల స్నానం అనగానే చాలామంది వణికిపోతారు. కానీ శరీరానికి ఇది కలిగించే ప్రయోజనాలు అద్భుతం. చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల రక్త ప్రసరణ వేగవంతమవుతుంది. శరీరంలోని అవయవాలు ఉత్తేజితమవుతాయి. రోగనిరోధక శక్తి బలపడుతుంది. అంతేకాదు చన్నీటి స్నానం అలసటను, కండరాల ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. చల్లటి నీరు మనసు, మెదడుపై సానుకూల ప్రభావం చూపిస్తుంది. ఉదయం చల్లటి నీటితో స్నానం చేస్తే రోజంతా ఉత్సాహంగా, ఫ్రెష్‌గా ఉంటారు.

45
ఎవరు ఏ నీటితో స్నానం చేయాలి?

వేడి నీటితో స్నానం అందరికీ సరిపోదు. అలాగే చల్లటి నీటితో స్నానం కూడా అందరికీ సరిపోదు. జలుబు, ఆస్తమా, సైనస్, ఆర్థరైటిస్ వంటి సమస్యలున్నవారు చల్లటి నీటితో స్నానం చేయకూడదు. వేడి నీరు వారికి సౌకర్యంగా ఉంటుంది. అలాగే హై బీపీ, మైగ్రేన్, స్కిన్ డ్రైనెస్ ఉన్నవారు చల్లటి లేదా గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిది. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం ఉత్తమం.

55
స్నానం తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

ఎలాంటి నీటితో స్నానం చేసినా… స్నానం తర్వాత వెంటనే చర్మాన్ని మెత్తటి టవల్ తో తుడుచుకోవాలి. మాయిశ్చరైజర్‌ వాడడం తప్పనిసరి. చల్లటి గాలిలో చర్మం త్వరగా డ్రై అవుతుంది. కాబట్టి ఆలివ్ ఆయిల్, కొబ్బరినూనె లేదా బాడీ లోషన్‌ వాడాలి. అలాగే స్నానం చేసిన వెంటనే బయటకు వెళ్లకపోవడం మంచిది. 

Read more Photos on
click me!

Recommended Stories