Health Care - Phone : మనలో చాలా మంది నిద్రలేవగానే ఫోన్లను చెక్ చేసుకుంటారు. అలా చేయడానికి చాలా కారణాలే ఉన్నాయి. వ్యక్తిగత విషయాలు కావచ్చు.. లేదా మన చుట్టూ ఏం జరుగుతుందనేది తెలుసుకోవడానికి కావచ్చు.. మన మిత్రులు, బంధువుల నుంచి ఏమైనా సమాచారం వచ్చిందా అనే విషయలు వుండవచ్చు. అయితే, నిద్రలేచిన వెంటనే ఇలా ఫోన్ చూడటం వల్ల మనపై చాలా ప్రతికూల ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నిద్ర లేచిన వెంటనే ఫోన్ చూసేయడం అలవాటుగా మారి అది వ్యవసానికి దారితీయవచ్చుననీ, కొద్ది సమయం కాస్తా క్రమంగా పెరగవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయాన్నే సోషల్ మీడియా ద్వారా బ్రౌజ్ చేయడం వల్ల సంతోషానికి కారణమయ్యే డోపామైన్ అనే హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది కాబట్టి ప్రజలు దీనిని విస్మరించలేరు. మీ మెదడు ఈ అలవాట్లను నిరుత్సాహపరచడానికి ఇది ఒక కారణం కావచ్చు. నిద్రలేచిన వెంటనే మన శరీరానికి ఏం జరుగుతుందనే విషయాలు చూస్తే..
ఒత్తిడిని పెంచుతుంది..
మీరు లేవగానే ఫోన్ చూడటంతో పనిభారం మొదలవుతుంది.. ఇది మీలో చాలా ఒత్తిడిని కలిగిస్తుంది, అందువల్ల మీరు మేల్కొన్న వెంటనే చాలా నోటిఫికేషన్లకు గురికావడం మీ మానసిక ఆరోగ్యానికి హానికరమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
మీకు తెలియకుండానే కాలయాపన.. టైమ్ వృధా !
మీ ఫోన్ లో యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాలో మునిగిపోవడం వల్ల మీరు చేయాల్సిన పనులు ఆగిపోవచ్చు. వీటివల్ల మీరు మీ పనులను పోస్ట్ పోన్ చేస్తారు. ఇది మీ లైఫ్ ను రిస్క్ లో పడేస్తుంది. .
నిద్రను చెడగొట్టి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది..
పడుకునే ముందు లేదా నిద్రలేచిన వెంటనే మీ ఫోన్ ను ఉపయోగించడం వల్ల మీ నిద్ర షెడ్యూల్ తగ్గుతుంది. స్క్రీన్ బ్లూ లైట్ మెలటోనిన్ ఉత్పత్తి చేసే శరీర సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇది ఇతర అనారోగ్యాలకు కారణం అవుతుంది.
కంటిపై ఒత్తిడిని పెంచుతూ..
ఫోన్ స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్ కంటిపై ఒత్తిడిని పెంచుతుంది. అలాగే మీ కంటి చూపుపై ఇది ప్రభావం చూపుతుంది. ఇది కంటి నొప్పి, తలనొప్పి, కళ్లు పొడిబారడం వంటి సమస్యలను కలిగిస్తుంది. దీంతో నార్మల్ లైఫ్ పై దెబ్బపడుతుంది.
మీ దృష్టిని తగ్గించి.. పరధ్యానంలోకి తీసుకెళ్లొచ్చు..
స్మార్ట్ ఫోన్ తో ఎక్కువ సమయం గడపడం వల్ల సాధారణంగా ఇతరులతో నడుచుకునే విధానంపై ప్రభావం పడుతుంది. అలాగే ఫోన్ తో నిరంతర కనెక్టివిటీ పరధ్యానానికి దారితీస్తుంది. ఇమెయిల్స్, సోషల్ మీడియా లేదా ఇతర ఆన్లైన్ కార్యకలాపాల వల్ల మీ శరీరం ఒత్తిడికి గురవుతుంది. ఇది మీరు గుర్తించే లోపే మీరు ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడతారు.