ఉదయాన్నే వేడి నీటిని తాగితే ఇన్ని లాభాలున్నాయా?

First Published | Feb 21, 2024, 9:40 AM IST

నీళ్లు మన శరీరానికి చాలా చాలా అవసరం. అయితే మనలో కొంతమంది తిన్నప్పుడు మాత్రమే నీళ్లు తాగుతుంటారు. కానీ ఇలా తాగితే మీరు ఎన్నో రోగాల బారిన పడుతుంటారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఉదయాన్నే గోరువెచ్చని గ్లాస్ నీటిని తాగే మీరెన్నో రోగాలకు దూరంగా ఉంటారు. 

వేడినీటితో ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవును ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లను తాగడం వల్ల ఆర్ద్రీకరణ, నిర్విషీకరణ నుంచి జీర్ణక్రియను మెరుగుపరచడం, ఒత్తిడిని తగ్గించడం వరకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయినప్పటికీ.. మరీ ఎక్కువగా ఉండే వేడినీళ్లను మాత్రం తాగకూడదు. ఈ వేడినీళ్లు మన ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.


జీర్ణక్రియ, జీవక్రియ

ఖాళీ కడుపుతో ఒక గ్లాసు వేడి నీళ్లను తాగడం వల్ల మీ మీ జీవక్రియ ఉత్తేజితమవుతుంది. అలాగే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. నీళ్ల వేడి జీర్ణ అవయవాలను ఉత్తేజపరుస్తుంది. అలాగే మన రోజువారి పనులకు సిద్ధం చేస్తుంది. ఇది ఆహార కణాలను మరింత సమర్థవంతంగా విచ్ఛిన్నం చేయడానికి, పోషక శోషణను పెంచడానికి సహాయపడుతుంది.
 


నిర్విషీకరణ

వేడి నీళ్లు నేచురల్ డిటాక్సిఫైయర్ గా కూడా పని చేస్తుంది. ఇది శరీరంలోని విషాన్ని బయటకు పంపడానికి సహాయపడుతుంది. అలాగే మన శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. చెమటపట్టేలా చేస్తుంది. అలాగే వ్యర్థాలు, మలినాలను వదిలించుకోవడానికి కూడా వేడినీళ్లు బాగా సహాయపడతాయి. అంతేకాకుండా గోరువెచ్చని నీరు మన రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది.
 

హైడ్రేషన్

మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరం హైడ్రేట్ గా ఉండాలి. ఉదయాన్నే మనం వేడి నీళ్లను తాగడం వల్ల రోజంతా హైడ్రేట్ గా ఉంటాం. హైడ్రేటెడ్ గా ఉండటం వల్ల పోషక రవాణా, ఉష్ణోగ్రత నియంత్రణ, అభిజ్ఞా పనితీరుతో సహా వివిధ శారీరక విధులు సక్రమంగా జరుగుతాయి. 

ముక్కు దిబ్బడ

ముక్కు దిబ్బడ లేదా సైనస్ సమస్యలు బాగా ఇబ్బంది పెడతాయి. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడానికి వేడి నీరు ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అవేడి నీటి నుంచి వచ్చే ఆవిరి శ్లేష్మాన్ని  పల్చగా చేయడానికి, సడలించడానికి, శ్వాసను సులువుగా తీసుకోవడానికి సహాయపడుతుంది.
 

ఉదయాన్నే వేడినీళ్లు తాగడం ఒక సాధారణ అలవాటుగా చేసుకుంటే ఎన్నో లాభాలు కలుగుతాయి. వేడి నీరు మన శరీరంపై ఓదార్పు ప్రభావాన్ని చూపుతుంది. అలాగే ఉద్రిక్త కండరాలను సడలించడానికి సహాయపడుతుంది. బరువును తగ్గించుకోవాలనుకునేవారికి కూడా వేడినీళ్లు ఎంతో మేలు చేస్తాయి. ఇది సంపూర్ణత్వ భావనను కలిగించి ఆకలిని నియంత్రిస్తుంది. ఇది బ్రేక్ ఫాస్ట్ సమయంలో అతిగా తినే అవకాశాన్ని కూడా తగ్గిస్తుంది. కేలరీలను మరింత సమర్థవంతంగా బర్న్ చేయడానికి కూడా వేడినీళ్లు మీకు సహాయపడతాయి. 
 

Latest Videos

click me!