నిద్రపోతున్నప్పుడు బీపీ పెరిగితే ఏమౌతుందో తెలుసా?

First Published | Feb 22, 2024, 4:15 PM IST

అధిక రక్తపోటు తేలిగ్గా తీసిపారేసేంత చిన్న సమస్య అయితే కాదు. ఎందుకంటే ఇది మన ప్రాణాలను తీసేయగలదు. మారుతున్న జీవనశైలి, చెడు ఆహారాలను తినడం వల్లే ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. అయితే చాలా మందికి నిద్రపోతున్నప్పుడు బీపీ బాగా పెరిగిపోతుంది. దీన్ని ఎలా గుర్తించి కంట్రోల్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

అధిక రక్తపోటు ప్రమాదకరమైన సమస్య. ప్రస్తుత కాలంలో చాలా మంది దీనితో బాధపడుతున్నారు. ఫాస్ట్ గా మారిపోతున్న లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్లే దీనికి కారణమవుతున్నాయి. మీకు తెలుసా? హై బీపీని సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. ఈ వ్యాధి ధమనులను దెబ్బతీస్తుంది. అలాగే హార్ట్ ఎటాక్, స్ట్రోక్ ప్రమాదాన్ని బాగా పెంచుతుంది. బీపీని కంట్రోల్ చేయకపోతే కిడ్నీ పనితీరు కూడా దెబ్బతింటుంది. 

blood pressure

అలాగే కంటిచూపు పోయేలా చేస్తుంది. అలాగే జ్ఞాపకశక్తిని కోల్పోయేలా చేస్తుంది. అందుకే రక్తపోటును నియంత్రణలో ఉంచడం చాలా ముఖ్యం. అయితే కొన్ని సంకేతాలతో రక్తపోటు పెరిగిందనడాన్ని సులువుగా తెలుసుకోవచ్చు. ఎన్పీజే డిజిటల్ మెడిసిన్ జర్నల్లో ప్రచురితమైన కొత్త అధ్యయనం ప్రకారం.. రాత్రిపూట ఎక్కువగా గురక పెట్టేవారికి రక్తపోటు అమాంతం పెరిగే ప్రమాదం ఉంది. ఇలాంటి వారు ప్రమాదాన్ని తప్పించుకోవడానికి దీని లక్షణాలను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Latest Videos


Image: Getty

నిద్రలేమి

ఒకప్పటి లైఫ్ స్టైల్ కు ఇప్పటి లైఫ్ స్టైల్ కు చాలా తేడా ఉంది. దీనివల్లే చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. రక్తపోటు కూడా నిద్రలేమి సమస్యను కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మీకు తెలుసా? హైబీపీ మన నిద్ర చక్రానికి ఆటంకం కలిగిస్తుంది. ఇది మీకు నిద్రపట్టకుండా చేస్తుంది. బీపీ పెరిగినప్పుడు మీరు రాత్రిళ్లు నిద్రపోవడానికి కష్టపడతారు.
 

snoring

గురక

కొంతమంది విపరీతంగా గురక పెడుతుంటారు. కొంతమందికి ఈ సమయంలో శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. దీనిని స్లీప్ అప్నియా అంటారు. అయితే రాత్రిపూట గురక పెడితే అది జస్ట్ స్లీప్ అప్నియా మాత్రమే కాకుండా అధిక రక్తపోటుకు కూడా సంకేతమంటున్నారు నిపుణులు. గురక ఇరుకైన రక్త నాళాల కారణంగా రక్త ప్రవాహ బ్లాక్ ను కూడా సూచిస్తుంది. ఇది హైబీపీకి సంకేతం. 
 

ఎక్కువ మూత్రం

రాత్రిపూట మీరు మూత్రానికి ఎక్కువగా వెళుతున్నారా? అయితే ఇది హైబీపీకి సంకేతం కావొచ్చు. అధిక రక్తపోటు మీ మూత్రపిండాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. దీంతో మూత్రం ఉత్పత్తి బాగా పెరిగి తరచుగా మూత్రం వస్తూనే ఉంటుంది. 

తలనొప్పి

రాత్రిళ్లు నిద్రలేచినప్పుడు తలనొప్పి వస్తే కూడా మీ బీపీ పెరిగిందని అర్థం చేసుకోవాలి. హైబీపీ వల్ల వచ్చే తలనొప్పి ఉదయం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నిద్రలో రక్తపోటు సహజంగా పెరుగుతుంది. అలాగే బాగా పెరిగిపోతుంది కూడా. 

click me!