Weight Loss: వేగంగా బరువు తగ్గాలంటే.. ఈ టిప్స్ పాటిస్తే చాలు..

Published : Jun 28, 2025, 10:40 AM IST

Weight Loss: ఈ రోజుల్లో చాలామంది అధిక బరువుతో బాధపడుతున్నారు. దీంతో వయస్సులో సంబంధం లేకుండా అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. కాబట్టి ఆరోగ్యంగా, చక్కటి శరీరాకృతితో ఆకర్షణీయంగా కనిపించాలంటే.. ఈ నియయాలను పాటించాల్సిందే. 

PREV
17
బరువు తగ్గడానికి

శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, ఊబకాయాన్ని తగ్గించడానికి మొదట ఆహారంపై శ్రద్ద వహించాలి. ఏ రకమైన ఆహారాలు, జీవనశైలి మార్పులు బరువు తగ్గడానికి సహాయపడతాయో తెలుసుకుందాం.. 

27
ఆహారపు అలవాట్లు

మీరు బరువు తగ్గాలనుకుంటే.. కార్బోహైడ్రేట్ ఆహారాన్ని తినడం తగ్గించాలి. అంటే. బియ్యం, దుంపలు వంటి కార్బోహైడ్రేట్, పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి. దానికి బదులుగా ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్లు, మంచి కొవ్వులు వంటివి తీసుకోవాలి. మీ బరువుకు తగినట్లుగా ప్రోటీన్ ఆహారాన్ని తీసుకోవడం వల్ల రోజంతా మీకు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. అనవసరమైన ఆకలిని తగ్గిస్తుంది.

37
ఈ ఆహారాపదార్థాలకు దూరం

వెయిట్ లాస్ ప్రాసెస్ లో మనం తినే ఆహారం కీలకపాత్ర పోషిస్తుంది. ఈ క్రమంలో కొన్ని ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ప్రాసెస్ ఫుడ్,  చక్కెర కలిపిన తినుబండారాలు, అధిక కొవ్వు గల డీ ఫ్రై ఫుడ్ ను తినడం మానేయాలి. 

47
తినే విధానం

మీ బరువును తగ్గించడంలో మీరు తినే విధానం కూడా గణనీయమైన మార్పును తీసుకురాగలదు. పెద్ద ప్లేట్లలో తినకుండా చిన్న ప్లేట్లు, గిన్నెలలో ఆహారాన్ని తినే అలవాటు చేసుకోండి. ఇది ఎక్కువగా తినకుండా నిరోధించడంలో సహాయ పడుతుంది. ఆహారం తినేటప్పుడు నెమ్మదిగా ప్రతి ముద్దను పూర్తిగా నమిలి తినండి. అలా తినడం వల్ల ఫుల్ గా తిన్నాం అనే ఫీలింగ్ కలుగుతుంది. 

57
ఈ సూపర్ టిప్ ను పాటించండి

బరువు తగ్గడానికి ఈ సూపర్ టిప్ ను పాటించండి. అదే మనం తినే విధానాన్ని మార్చుకోవడమే. మీరు ఉదయం 8 నుండి 9 గంటలకు మీ అల్పాహారం తీసుకోవాలి. మధ్యాహ్న భోజనాన్ని 12 నుండి 2 గంటల లోపు తినాలి. సాయంత్రం భోజనాన్ని 7 గంటల లోపు తిని ముగించాలి. ఆ తర్వాత ఏ ఆహారాన్నీ, తినుబండారాలనీ తినకూడదు. ఈ డైట్ ను స్ట్రీట్ గా ఫాలోకండి.  

67
వ్యాయామం

బరువు తగ్గడానికి మాత్రమే కాదు.. ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరి. మన రోజువారీ వ్యవహరాల్లో కనీసం 30 నిమిషాలు వ్యాయామానికి కేటాయించండి. వాకింగ్,  జాగింగ్, రన్నింగ్ వంటివి దేనినైనా ఒక వ్యాయామాన్ని ప్రతిరోజూ చేయండి. వారంలో 150 నిమిషాలు వ్యాయామాలు లేదా 75 నిమిషాలు కఠిన వ్యాయామాలు చేయాలి. వారంలో రెండు సార్లు కండరాల బలపరిచే వ్యాయామాలు చేయాలి.

77
నిద్ర

బరువు తగ్గాలనుకునే వారికి వ్యాయమంతో పాటు విశ్రాంతి కూడా అవసరం. ప్రతిరోజూ 7 నుండి 8 గంటలు తప్పనిసరిగా నిద్రపోవాలి. సరైన నిద్ర, ఆకలిని అదుపులో ఉంచుతుంది. హార్మోన్లను నియంత్రించడంలో సహాయపడుతుంది. నిద్ర లేకపోతే ఎక్కువ ఆకలి వేస్తుంది.

చిన్న లక్ష్యాలు; బరువు తగ్గాలనుకున్న వెంటనే 10 నుండి 15 కిలోల బరువు తగ్గాలని అనుకోవడం తప్పు. మొదట కిలో, తర్వాత రెండు కిలోలు ఇలా క్రమంగా బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.

పైన చెప్పిన ఈ విషయాలను పాటించడం వల్ల త్వరలో బరువు తగ్గవచ్చు. ఏ విషయంలోనైనా నిరంతర ప్రయత్నం మాత్రమే ఫలితాన్నిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories