Health Tips: వాకింగ్ లేదా జాగింగ్‌.. మీ ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?

Published : May 26, 2025, 09:30 AM IST

Health Tips:  ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం చాలామంది వాకింగ్, రన్నింగ్, జాగింగ్ వంటి ఇతర శారీరక వ్యాయామాలు చేస్తుంటారు. అయితే  వాకింగ్, జాగింగ్.. రెండింటిలో ఏది మంచిది ? ఏది మన ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుంది? తెలుసుకుంటే..

PREV
15
వాకింగ్ vs జాగింగ్ ఏది బెస్ట్ ?

శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి వ్యాయామం చాలా ముఖ్యం. అన్ని వయస్సుల వారు సులభంగా చేయగల వ్యాయామం అంటే నడకే. కానీ నడక మొత్తం శరీరానికి వ్యాయామం అవుతుందా? జాగింగ్ దానికంటే మంచిదా? అనే సందేహాలు ప్రజల్లో ఉన్నాయి.

25
ఏది బెటర్ ?

బరువు తగ్గడానికి, డయాబెటిస్‌ను నియంత్రించడానికి, గుండె జబ్బులకు, అనేక వ్యాధులను నియంత్రించడానికి నడక, నెమ్మదిగా పరిగెత్తే జాగింగ్ వ్యాయామం మంచి ఫలితాలను ఇస్తాయి. కానీ వీటిలో ఎక్కువ దూరం నడవడమా?  తక్కువ దూరం పరిగెత్తడమా? ఏది మంచిదని వైద్యులు ఏం చెబుతున్నారో తెలుసా?

35
ఎక్కువ కేలరీలు

వాకింగ్ లేదా జాగింగ్‌లో ఏదో ఒకటి మంచిదని చెప్పడం కష్టం. పరిగెత్తడం వల్ల సమయం ఆదా అవుతుంది. 1 కి.మీ పరిగెడితే 6 నుండి 8 నిమిషాలు పట్టవచ్చు. కొంతమందికి ఇంకా తక్కువ సమయం పడుతుంది. కానీ నడవడానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. 2 కి.మీ నడవాలంటే 20 నుండి 25 నిమిషాలు పడుతుంది. నడిచే దానికంటే పరిగెత్తేటప్పుడు ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి.

45
జాగింగ్ vs వాకింగ్

నడవడందానికంటే పరిగెత్తడానికి ఎక్కువ శక్తి అవసరం. దీని వల్ల ఎక్కువ శక్తి ఖర్చవుతుంది. నడిచే దానికంటే పరిగెత్తడం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కానీ, జాగింగ్ చేయడం వల్ల కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. కీళ్ళు, టెండోనిటిస్ లపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. నడక అలా కాదు. అంతేకాకుండా నడిచేటప్పుడు గాయాలు అయ్యే ప్రమాదం తక్కువ. ఇప్పటికే అధిక బరువు, కీళ్ల నొప్పులు, గుండె జబ్బులు ఉన్నవారు పరిగెత్తడం కష్టం. నొప్పి రావచ్చు. వీరికి నడక మంచిది. వృద్ధులు జాగింగ్ చేయడం కంటే నడవడమే మేలు.  

55
రెండూ ఆరోగ్యకరమే

వారానికి 300 నిమిషాలు తేలికపాటి వ్యాయామం చేయాలి. ఈ లక్ష్యాన్ని చేరుకోలేకపోతే నడకతో పాటు 150 నిమిషాలు మోస్తరు వ్యాయామం చేయవచ్చు. నడక చేయలేకపోతే జాగింగ్ చేయవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories