చాలా మంది బరువు తగ్గాలనే భావనతో ఉదయాన్నే.. బ్రేక్ ఫాస్ట్ చేయడం మానేస్తారు. లేదంటే.. ఏదైనా పని కారణంగానో.. అల్పాహారం తీసుకోరు. దాని వల్ల మెదడు చురుకుగా పనిచేయదట. మెదడుకు అల్పాహారం చాలా అవసరం. ఏదో జీవితంలో ఒకసారో , రెండుసార్లో బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేసినా పర్వాలేదు. కానీ, ఏళ్ల తరబడి నిరంతరాయంగా చేస్తే, శరీర కండరాలు ,మెదడుకు తగినంత శక్తి లభించదు. వీటి సామర్థ్యం మెల్లమెల్లగా తగ్గిపోతోంది. అంతేకాకుండా గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం, కొవ్వు అధికంగా పేరుకుపోవడం వంటి సమస్యలు వస్తాయి. ఇవి స్ట్రోక్‌కి కారణమవుతాయి.