గులాబీ పువ్వుల రేకులతో న్యాచురల్ బ్యూటీ బెనిఫిట్స్.. ఎలానో మీకు తెలుసా?

Navya G   | Asianet News
Published : Dec 12, 2021, 04:18 PM IST

గులాబీ పువ్వులు చూడడానికి మీ అందంగా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ అందమైన గులాబీ పువ్వుల రేకులు చర్మ సౌందర్యాన్ని మెరుగు పరచడానికి చక్కగా పనిచేస్తాయి. చర్మ సౌందర్యం కోసం గులాబీ పువ్వుల రేకులతో ఫేస్ ప్యాక్ లను తయారు చేసుకోవడం మంచిదని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. గులాబీ పువ్వుల రేకులలో (Rose petals) ఉండే పోషకాలు చర్మం నిగారింపు పెంచుతాయి. గులాబీ రేకులను సబ్బులు, పర్ఫ్యూమ్స్ వంటి అనేక సౌందర్య లేపనాల తయారీలో వాడుతారు. గులాబీల పువ్వులతో చేసిన లేట్ సౌందర్య లేపనాలు మంచి సువాసనలు వెదజల్లుతాయి. అయితే ఇప్పుడు గులాబీ పువ్వుల రేకులతో కలిగే నేచురల్ బ్యూటీ బెనిఫిట్స్ (Natural Beauty Benefits) గురించి తెలుసుకుందాం..  

PREV
17
గులాబీ పువ్వుల రేకులతో న్యాచురల్ బ్యూటీ బెనిఫిట్స్.. ఎలానో మీకు తెలుసా?

రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ (Antifungal), యాంటీ వైరల్ (Antiviral) లక్షణాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి వీటిని స్కిన్ రాషెష్, స్కిన్ బర్న్ వంటి ఇతర స్కిన్ సమస్యల నివారణకు రోజా పువ్వుల రేకులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. రోజా పువ్వుల రేకులు చర్మ సౌందర్యాన్ని మెరుగు పరచడంతో పాటు ఆరోగ్యానికి కూడా చక్కగా ఉపయోగపడతాయి.  
 

27

చర్మ సౌందర్యాన్ని మెరుగుపరిచే అనేక బ్యూటీ ప్రొడక్ట్స్ (Beauty Products) లో రోజ్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. రోజా పువ్వు చర్మాన్ని కాంతివంతంగా తాజాగా  ఉంచేందుకు సహాయపడుతుంది. కనుక చర్మ సౌందర్యం కోసం రోజ్ వాటర్ (Rose water) ను ఉపయోగించడం మంచిది. రోజ్ పెడల్స్ తో కలిగే బ్యూటీ బెనిఫిట్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 
 

37

యాంటీ బ్యాక్టీరియల్: మొటిమలను (Pimples) వాటి తాలూకు మచ్చలు (Spots) నివారించడానికి నేచురల్ గా యాంటీ బ్యాక్టీరియల్ ఎసెన్షియల్ ఆయిల్ సాయపడుతుంది. చర్మం మృదువుగా మరియు కాంతివంతంగా మారడానికి రోజ్ వాటర్ ను ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. రోజ్ వాటర్ ఫేస్ వాష్ గా, మంచి క్లియర్ గా ఉపయోగపడుతుంది.
 

47

యాంటీ ఇన్ఫ్లమేటరీ: రోజా పువ్వు రేకులలో యాంటీ ఇన్ఫ్లమేటరీ (Anti inflammatory) లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ముఖంపై ఏర్పడే మొటిమలను, ఎర్రగా మారిన చర్మానికి నయం చేయడానికి సహాయపడుతాయి. రోజా పూలలోని  ఔషధ గుణాలు దురద, తామర వంటి చర్మ సమస్యలు (Skin problems) నివారించడానికి చక్కగా పనిచేస్తాయి.
 

57

రోజా పువ్వు రేకులను నీటిలో మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత ఆ రేకులను మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ గులాబి పువ్వు రేకుల పేస్ట్ (Rose petals paste) కు కొంచెం తేనె (Honey) కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్ర పరుచుకోవాలి. ఇలా చేయడంతో ముఖం కాంతివంతంగా మారుతుంది.       
 

67

యాంటీ ఆక్సిడెంట్స్: గులాబీ రేకులలో యాంటీ ఆక్సిడెంట్స్ (Antioxidants) పుష్కలంగా ఉంటాయి. చర్మంలోని మృత కణాలను (Dead cells) తొలగించడానికి చక్కగా పనిచేస్తాయి. సన్ బర్న్ కు చర్మం టాన్ కాకుండా రక్షిస్తాయి. నిగారింపును పెంచుతాయి. 
 

77

మాయిశ్చరైజింగ్: గులాబీలో ఉండే నేచురల్ ఆయిల్ (Natural oil) చర్మానికి మంచి మాయిశ్చరైజర్ (Moisturizer) గా ఉపయోగపడుతుంది. ఇది చర్మాన్ని మృదువుగా మార్చడానికి సహాయపడుతుంది. సెన్షిటివ్ స్కిన్ కలిగిన వారికి రోజ్ గ్రేట్ గా సహాయపడుతుంది.

click me!

Recommended Stories