పిల్లల్లో కడుపు నొప్పి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కలుషిత ఆహారం (Contaminated food), కడుపులో ఇన్ఫెక్షన్లు, మలబద్దకం సమస్యలు, జీర్ణాశయ సమస్యలు (Gastrointestinal problems) వంటి అనేక కారణాలు పిల్లల్లో కడుపు నొప్పికి దారితీస్తాయి. ఇలా పిల్లల్లో కడుపు నొప్పి సమస్యలు ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్ళడానికి వీలులేని సమయంలో ఇంట్లోనే దొరికే సహజసిద్ధమైన చిట్కాలను ఉపయోగించడం మంచిది. అయితే ఇప్పుడు ఇంట్లో దొరికే వస్తువులతోనే ఏవిధంగా పిల్లలలో కడుపు నొప్పి సమస్యలు తగ్గుతాయో తెలుసుకుందాం..