Tea: టీ ఎక్కువగా తాగుతున్నారా..? ఈ సమస్యలొస్తాయట జాగ్రత్త..

Published : Jul 14, 2025, 01:09 PM IST

Tea Side Effects: వరల్డ్ మోస్ట్ ఫేమస్ అండ్ పాపులర్ డ్రింక్స్‌లో టీ కూడా ఒకటి. కొందరికి టీ తాగకపోతే ఏం తోచదు. తలనొప్పి కూడా వస్తుంది. టీ తాగితే పలు ప్రయోజనాలున్నాయి. కానీ, అతిగా టీ తాగితే.. అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంట. అవేంటో తెలుసుకుందాం. 

PREV
19
టీ ఎక్కువగా తాగుతున్నారా..?

వాతావరణం కాస్త చల్లగా ఉంటే చాలు చాలామంది వేడివేడిగా ఓ కప్పు టీ తాగుతారు. ఇది కొంతమందికి ఫేవరేట్ డ్రింక్. అయితే..  టీని ఎక్కువగా తాగితే.. కొన్ని సమస్యలు తప్పవట. ప్రధానంగా ఎక్కువగా టీ తాగడం వల్ల ఐరన్ లోపం, నిద్రలేమి, తలనొప్పి, రక్తపోటు పెరగడం వంటి సమస్యలు వస్తాయి. టీలోని క్యాఫైన్, టానిన్ వంటి పదార్థాలు శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. 

29
బ్లాక్ టీ

బ్లాక్ టీ (పాలు లేని టీ)లో ఒక్క కప్పులో సగటున 40–60 మి.గ్రా క్యాఫైన్ ఉంటుంది. ఒక రోజు క్యాఫైన్ పరిమితి 400 మి.గ్రా వరకు మాత్రమే తీసుకోవాలి. అంటే.. రోజుకు 8–10 కప్పుల బ్లాక్ టీ తాగితే గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. తద్వారా చేతులు వణకడం, నిద్రలేమి, ఆందోళన వంటి లక్షణాలు తలెత్తుతాయి.  

39
జీర్ణ సమస్యలు:

టీని అధికంగా తాగడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు ఏర్పడవచ్చు. టీలో ఉండే టానిక్ ఆమ్లం కడుపు కణజాలాన్ని బలహీనపరచి, గుండెల్లో మంట, అజీర్ణం, వాంతుల్లాంటి వికారం కలిగిస్తుంది. ముఖ్యంగా ఖాళీ కడుపుతో టీ తాగితే ఈ ప్రభావాలు మరింత ఎక్కువగా కనిపిస్తాయి.

49
తలనొప్పి

ఎక్కువ కాఫీన్ ఉన్న టీ తరచుగా తాగేవారిలో తలనొప్పి రావడం సాధారణం. రోజుకు 700 మి.గ్రా కాఫీన్‌కి మించి తీసుకుంటే, రక్తనాళ సంకోచం, దీర్ఘకాలిక ఉద్రిక్తత, తీవ్ర తలనొప్పులు (మైగ్రేన్) వంటి సమస్యలు తలెత్తవచ్చు. 

59
ఎముకల బలహీనత

అధికంగా టీ తాగడం వల్ల శరీరంలో కాల్షియం లోపం ఏర్పడే ప్రమాదం ఉంది. టీలోని క్యాఫైన్ కారణంగా కాల్షియం మూత్రం ద్వారా త్వరగా బయటకు వెళ్లిపోతుంది. దీని వల్ల దీర్ఘకాలికంగా ఎముకల బలహీనత, ఎముకలు విరిగే ప్రమాదం పెరుగుతుంది. 

69
దుష్ప్రభావాలు

ఎక్కువ టీ తాగితే  గుండె వేగంగా కొట్టుకోవడం, రక్తపోటు పెరగడం వంటి సమస్యలు కలగవచ్చు. ఇప్పటికే గుండె సున్నితంగా ఉన్నవారిలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది.  

79
రోజుకు ఎన్నిసార్లు టీ తాగవచ్చు?

రోజుకు 400 మి.లీ కంటే తక్కువ టీ తాగడం ఆరోగ్యానికి మంచిది. అంటే.. 3 లేదా 4 కప్పులు. దానికంటే ఎక్కువ తాగితే నిద్రలేమి, జీర్ణ సమస్యలు, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి.

89
టీ తాగడానికి సరైన సమయం?

భోజనానికి 30 నిమిషాల ముందు టీ తాగడం మంచిది. అప్పటివరకు కడుపు తేలికగా ఉండటం వల్ల జీర్ణానికి ఆటంకం కలగదు. కానీ భోజనం సమయంలో లేదా వెంటనే తర్వాత టీ తాగితే, టీలోని టానిన్‌లు ఆహారంలో ఉన్న పోషకాలను శోషించడాన్ని తగ్గిస్తాయి.  

99
గర్భస్రావం

గర్భధారణ సమయంలో అధిక కాఫీన్‌ తీసుకోవడం వల్ల శిశువు అభివృద్ధికి ఆటంకం కలుగువచ్చు.  కొన్ని సందర్భాలలో గర్భస్రావానికి కారణం కావచ్చు. అందుకే గర్భం సమయంలో సాధారణ టీకి బదులుగా రాస్ప్బెర్రీ ఆకు, పుదీనా, లేదా అల్లం వంటి సహజ పదార్థాలతో తయారైన హెర్బల్ టీలు తాగడం ఉత్తమం.  

Read more Photos on
click me!

Recommended Stories