Pregnancy: గర్భధారణ ( Pregnancy)అనేది ప్రతి మహిళ జీవితం లో మధురమైన ఘట్టం. జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి కారణంగా మహిళల్లో గర్భసమస్యలు పెరుగుతున్నాయి. పిల్లలు పుట్టకపోవడానికి ప్రధాన కారణాలేంటో తెలుసుకుందాం.
ప్రతి మహిళ జీవితంలో మాతృత్వం అనేది ఓ అనన్యమైన అనుభూతి. కానీ ఈ ఆనందం అందరికీ లభించదు. కొన్ని కారణాల వల్ల స్త్రీలు గర్భం దాల్చడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. గర్భధారణను ప్రభావితం చేసే ప్రధాన కారణాలలో అధిక బరువు ఒకటి. అధిక బరువు ఉన్న స్త్రీలు గర్భం దాల్చడం కష్టం. అదేవిధంగా పురుషులలో ఊబకాయం కూడా సంతానోత్పత్తి సమస్య కారణం. కాబట్టి బరువు తగ్గడం మొదటి పరిష్కారం.
25
థైరాయిడ్ అసమతుల్యత, రుతు చక్రం
థైరాయిడ్ హార్మోన్లు (T3, T4) లైంగిక సామర్థాన్ని ప్రభావితం చేస్తాయి. వీటి అసమతుల్యత వల్ల గర్భధారణ సమస్యలు, గర్భస్రావాలు వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి.
క్రమరహిత నెలసరి (రుతు చక్రం) కూడా ప్రెగ్నెన్సీ ఆలస్యానికి కారణం. సాధారణంగా ఋతు చక్రం 28 రోజులకు ఒకసారి 3 -5 రోజులు రక్తస్రావం జరుగుతుంది. అధిక రక్తస్రావం లేదా క్రమరహిత ఋతు చక్రం వంటి సమస్యలు ఉంటే తక్షణం వైద్య సలహా అవసరం.
35
పీసీఓడీ, వీర్య సమస్యలు
PCOS (పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్) వల్ల అండం ఉత్పత్తిలో జాప్యం, క్రమరహిత ఋతు చక్రం వల్ల గర్భధారణలో సమస్యలు ఏర్పడతాయి. అయితే, ఇది సరైన చికిత్సతో నియంత్రించవచ్చు.
అలాగే, గర్భం దాల్చడంలో ఇబ్బంది ఉంటే పురుషులకు వీర్య పరీక్ష అవసరం. తక్కువ వీర్యకణాల సంఖ్య లేదా వీర్యకణాల పనితీరు లోపం వంధ్యత్వానికి దారితీస్తాయి. పరీక్షల ద్వారా సమస్యలు గుర్తించి చికిత్స చేస్తే గర్భధారణ అవకాశాలు మెరుగవుతాయి.
25 నుంచి 35 ఏళ్ల మధ్యలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వారు ముందుగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వికల్ క్యాన్సర్) పరీక్ష చేయించుకోవడం అత్యంత అవసరం. ఇది భవిష్యత్ ఆరోగ్య సమస్యలను నిరోధించడంలో సహాయపడుతుంది.
ప్రెగ్నెన్సీ కోసం తేలికపాటి నుంచి మోస్తరు వ్యాయామం తప్పనిసరి వ్యాయామం చేయడం వల్ల రుతు చక్ర నియంత్రణ, రక్త ప్రసరణ, ఆక్సిజన్ సరఫరా మెరుగుపడుతుంది. దీని వల్ల గర్భధారణ సులభం అవుతుంది.
55
గమనిక
పైన పేర్కొన్న సమాచారం అంతా ఇంటర్నెట్‌లో లభించే సాధారణ సమాచారం మాత్రమే. ప్రతి ఒక్కరి ఆరోగ్యం, గర్భం దాల్చడానికి గల కారణాలు వేర్వేరుగా ఉండవచ్చు. కాబట్టి మీకు గర్భం ఆలస్యం అవుతుంటే సరైన వైద్యుడిని సంప్రదించి సలహా, చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం.