Smoking Habit: మీరు స్మోకింగ్ చేస్తారా? అయితే ఈ భయంకరమైన వ్యాధి గురించి తప్పకుండా తెలుసుకోండి

Published : Apr 16, 2025, 03:23 PM IST

Smoking Habit: ఈ కాలంలో స్మోకింగ్ ఒక అలవాటుగా మారిపోయింది. ఒత్తిడిగా అనిపిస్తే ఒక దమ్ము కొట్టి వద్దాం అనే ఆలోచన యువతలో బాగా పెరిగిపోతోంది. అయితే స్మోకింగ్ అప్పటికప్పుడు రిలాక్షేషన్ ఇచ్చినా భవిష్యత్తులో తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. స్మోకింగ్ వల్ల ఒక భయంకరమైన వ్యాధి సోకుతుంది. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
Smoking Habit: మీరు స్మోకింగ్ చేస్తారా? అయితే ఈ భయంకరమైన వ్యాధి గురించి తప్పకుండా తెలుసుకోండి

స్మోకింగ్ చేసే వారిలో వచ్చే ప్రమాదకరమైన వ్యాధి పేరు బర్గర్ డిసీజ్. ఇది గాని అటాక్ అయితే చేతులు, కాళ్ళకి రక్త సరఫరాని అడ్డుకుంటుంది. ఫలితంగా గ్యాంగ్రీన్, స్ట్రోక్ కి దారితీస్తుంది. ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చు. దీని లక్షణాలు, చికిత్స గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. 
 

25

స్మోకింగ్ చేసే వాళ్లు 25 కోట్ల మంది..

ఈ రోజుల్లో చాలా మంది చెడు అలవాట్లకు బానిసలై ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడుతున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO) నివేదిక ప్రకారం భారతదేశంలో 15 ఏళ్ళు పైబడిన 25 కోట్ల మంది ధూమపానం చేస్తున్నారు. స్మోకింగ్ వల్ల క్యాన్సర్ తో పాటు ఇతర వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుంది. అలాంటి వ్యాధుల్లో ఒకటి బర్గర్ డిసీజ్. దీన్ని థ్రోంబోఆంజియిటిస్ ఒబ్లిటెరాన్స్ అని కూడా అంటారు. 

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ నివేదిక ప్రకారం, ప్రపంచంలో లక్ష మందిలో 15 నుండి 20 మందికి ఈ వ్యాధి ఉంటుంది. ఈ వ్యాధి వల్ల ధమనులు కుంచించుకుపోయి, చేతులు, కాళ్ళు కూడా పోయే ప్రమాదం ఉంది. 

35

బర్గర్ డిసీజ్ అంటే ఏమిటి?

ఎక్కువగా స్మోకింగ్ చేయడం వల్ల చేతులు, కాళ్ళ వేళ్ళలోని రక్తనాళాల్లో వాపు వస్తుంది. దీనివల్ల రక్త ప్రసరణ తగ్గి, రక్తం గడ్డ కడుతుంది. చేతులు, కాళ్ళకి సరిపడా రక్తం అందకపోతే ఇన్ఫెక్షన్, కణజాల నష్టం జరుగుతుంది. చర్మ కణాలు దెబ్బతిని, తీవ్రమైన సమస్యలు వస్తాయి.

45

బర్గర్ డిసీజ్ లక్షణాలు

బర్గర్ డిసీజ్ ఉంటే చేతులు, కాళ్ళలో నొప్పి వస్తుంది. పడుకున్నప్పుడు ఈ నొప్పి ఎక్కువవుతుంది. నెమ్మదిగా నడిచినప్పుడు తొడల్లో నొప్పి చర్మం రంగు మారడం చేతులు, కాళ్ళలో పుండ్లు, చేతులు, కాళ్ళలో మంట, చలిలో వేళ్ళు తెల్లబారడం, రక్తం గడ్డ కట్టడం, కండరాల నొప్పులు, చర్మం పుండ్లు పడడం జరుగుతుంది. 

బర్గర్ డిసీజ్ వల్ల స్ట్రోక్, గుండెపోటు, గ్యాంగ్రీన్, మినీ స్ట్రోక్, చేతుల రక్తనాళాల సమస్యలు, నాడీ వ్యవస్థకు చెందిన ఇబ్బందులు వస్తాయి. 

55

బర్గర్ డిసీజ్ కి శాశ్వత చికిత్స లేదు. వ్యాధి లక్షణాలను తగ్గించడానికి వైద్యులు యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు ఇస్తున్నారు. ధూమపానం మానేయాలని సలహా ఇస్తున్నారు. ఈ వ్యాధి ధూమపానం చేసే వారిలోనే వస్తుంది కాబట్టి వైద్యులు ధూమపానం, తంబాకు పూర్తిగా మానేయమని సలహా ఇస్తున్నారు. 

ఇది కూడా చదవండి టూత్ బ్రష్ నిండా పేస్ట్ వేసుకొని పళ్లు తోముతున్నారా? ఎంత డేంజరో తెలుసా?

Read more Photos on
click me!

Recommended Stories