వెల్లుల్లి తింటే మంచే కాదు.. చెడు కూడా జరుగుతుంది.. జర జాగ్రత్త

First Published Feb 9, 2023, 2:10 PM IST

వెల్లుల్లితో ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. వెల్లుల్లి మన శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. అలా అని వీటిని ఎక్కువగా తింటే మాత్రం ఎన్నో సమస్యలు వస్తాయి. 

Image: Getty Images

వెల్లుల్లిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. వీటిని ఆహారంలో వేయడం వల్ల ఫుడ్ రుచిగా కావడమే కాదు.. ఆరోగ్యం కూడా బాగుంటుంది. వెల్లుల్లిని తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్త ప్రవాహాం మెరుగ్గా ఉండటంతో పాటుగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అలా అని ప్రతిరోజూ దీన్ని మోతాదుకు మించి తింటే మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. సూప్ లు, పిజ్జాలు, సాస్ లు, వెజిటేబుల్స్, నాన్ వెజ్ వంటకాలు, పరాఠాల్లో వాడే వెల్లుల్లి ఎన్నో వ్యాధులకు కారణమవుతుంది. వెల్లుల్లిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

garlic

ఎసిడిటీ

వెల్లుల్లిని ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి అంటే GERD వచ్చే అవకాశాలు ఎక్కువవుతాయి.  ఈ సమస్య వల్ల మీ కడుపులో ఏర్పడిన ఆమ్లం అన్నవాహిక నుంచి కడుపులోకి తిరిగి వస్తుంది. దీనివల్ల చికాకు, ఒత్తిడి వంటి సమస్యలు కలుగుతాయి.  జూలై 2005లో అమెరికన్ ఫ్యామిలీ ఫిజిషియన్‌లో ప్రచురించబడిన ఒక కథనం ప్రకారం.. ఖాళీ కడుపున పచ్చి వెల్లుల్లి తినడం వల్ల  జీర్ణవ్యవస్థలో చికాకు కలుగుతుంది. అంతేకాదు పచ్చి వెల్లుల్లి తినడం వల్ల వాంతులు, కడుపునొప్పి సమస్యలు కూడా వస్తాయి. 

నోటి దుర్వాసన 

పచ్చి వెల్లుల్లి తింటే నోటి దుర్వాసన, గుండెల్లో మంట, ఎసిడిటీ, డయేరియా వంటి సమస్యలు కూడా వస్తాయి. ఇదేకాకుండా ఏదైనా ఆహార పదార్థాల్లో.. అన్నింటికంటే ఎక్కువ పరిమాణంలో వెల్లుల్లిని ఉపయోగిస్తే రక్తస్రావం , అలెర్జీలు వచ్చే ప్రమాదం ఉంది.

ముఖానికి అప్లై చేయకూడదు

వెబ్ మెడ్ ప్రకారం.. వెల్లుల్లిని నేరుగా ముఖానికి అప్లై చేస్తే ముఖంపై చికాకు కలుగుతుంది. దీన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల దద్దుర్లు వస్తాయి. 

దద్దుర్లు రావడానికి కారణాలు

వెల్లుల్లిని చాలా కాలం నుంచి తింటే చర్మపు చికాకు, దురద సమస్యలు వస్తాయి. వెల్లుల్లిలో ఉండే కొన్ని ఎంజైములు ఈ చికాకును కలిగిస్తాయి.

వెల్లుల్లితో వీటిని తినకండి: అల్లం, లవంగం, పసుపు, క్యాప్సికమ్ వంటి ఆహారాలతో వెల్లులిని తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. 
 

వెల్లుల్లిలో ఉండే పోషకాలు 

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వెల్లుల్లిలో విటమిన్ సి, విటమిన్ బి 6, భాస్వరం, మాంగనీస్, జింక్, కాల్షియం, ఇనుము వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లతో పాటుగా థియామిన్, పాంతోతేనిక్ ఆమ్లం కూడా ఇందులో ఉంటాయి. వీటితో పాటుగా అయోడిన్, క్లోరిన్, సల్ఫర్, అల్లిసిన్ వంటి ఖనిజాలు కూడా దీనిలో ఉంటాయి. 
 

వెల్లుల్లి ఆరోగ్య ప్రయోజనాలను పొందాలంటే దీన్ని ఆహారంలో చాలా తక్కువగా వాడాలి. అయినప్పటికీ.. ప్రతి మొగ్గలో తక్కువ కేలరీలు, కొవ్వు, ప్రోటీన్ లేదా కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇందులో ఉండే ఎంజైములు, ప్రత్యేక సమ్మేళనాలు ఉంటాయి.  

వెల్లుల్లిని ఎంత తీసుకోవాలి?

దీని ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి చాలా మంది ఉదయాన్నే పరగడుపున వెల్లుల్లి తినడానికి ఇష్టపడతారు. అయితే 1 లేదా 2 వెల్లుల్లి రెబ్బలను మాత్రమే తినాలి. దీని కంటే వెల్లుల్లి  రెబ్బలను తింటే మీ ఆరోగ్యం పాడవుతుంది. వీటిని తిన్న తర్వాత ఎక్కడైనా వాపు లేదా చికాకుగా అనిపిస్తే వెంటనే వెల్లుల్లిని తినడం మానేయండి. వైద్యుల సలహా తీసుకోండి. 

click me!