బరువు పెరగాలనుకుంటున్నారా? అయితే వీటిని తినండి

First Published Feb 3, 2023, 2:51 PM IST

కండరాల నిర్మాణం, బరువు పెరగడం కనిపించినంత సులువైతే కాదు. అయితే కొన్ని ఆహారాలు మీరు ఆరోగ్యంగా బరువు పెరిగేందుకు బాగా సహాయపడతాయి. అవేంటంటే.. 
 

జంక్ ఫుడ్ లేదా పేస్ట్రీలు, కుకీలు, ఐస్ క్రీమ్ వంటి వైట్ ఫుడ్స్ తినడం వల్ల త్వరగా బరువు పెరుగుతారన్నది నిజం. క్యాలరీలు ఎక్కువగా ఉండే ఆహారాలు నిస్సందేహంగా బరువు పెరగడానికి మీకు సహాయపడతాయి. కానీ వాటిలో పోషకాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, చక్కెరలు చాలా తక్కువగా ఉంటాయి. ఇలాంటి ఆహారాలు మీ శరీరాన్ని దెబ్బతీస్తాయి. ఎన్నో రోగాలకు కారణమవుతాయి. అందుకే బరువు పెరిగేందుకు ఇలాంటి ఆహారాలను పొరపాటున కూడా తినకూడదు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొన్ని పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలు మీరు ఆరోగ్యంగా బరువు పెరిగేందుకు ఎంతగానో సహాయపడతాయి. అవేంటంటే.. 

avocado

అవోకాడో

అవొకాడోలు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తాయి. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. వీటిలో మోనోశాచురేటెడ్ కొవ్వులు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మీరు  ఆరోగ్యంగా ఉండటానికి, బరువు పెరగడానికి సహాయపడతాయి. అంతేకాదు ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా తగ్గించడానికి సహాయపడతాయి. 

potato

ఆలుగడ్డ

బంగాళాదుంపలు వంటి పిండి పదార్ధాలు త్వరగా బరువు పెరగడానికి సహాయపడతాయి. బంగాళాదుంపలను తీసుకోవడం వల్ల మీ శరీరానికి అదనపు కేలరీలు అందుతాయి. ఈ బంగాళాదుంపల ఆహారంలో బరువు పెరగడంలో మీకు సహాయపడే పిండి పదార్థాలు, కేలరీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మీ కండరాల గ్లైకోజెన్ ను కూడా పెంచుతాయి. 
 

అరటి పండ్లు

మీరు బరువు పెరగాలనుకుంటే అరటిపండ్లు అద్భుతమైన ఎంపిక. అరటి పండ్లు జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి, మానసిక స్థితిని మెరుగుపర్చడానికి, నిద్ర నియంత్రణకు అరటిపండ్లు ఎంతో మేలు చేస్తాయి. అందుకే ఆరోగ్యంగా బరువు పెరగాలనుకున్న వారు తప్పకుండా అరటిపండ్లను తినండి. 

peanut butter

వేరుశెనగ వెన్న

వేరుశెనగ వెన్న చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలో అధిక కొవ్వు కంటెంట్  మోనోశాచురేటెడ్, పాలీఅన్శాచురేటెడ్ కొవ్వులు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మీరు బరువు పెరగడానికి సహాయపడతాయి. అంతేకాదు దీనిలో మంచి మొత్తంలో ఫైబర్, మెగ్నీషియం, ప్రోటీన్ కూడా ఉంటాయి. ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. 
 

nuts

గింజలు 

బరువు పెరగడానికి ఏయే ఆహారాలను తినాలని ఆలోచిస్తున్నారా? అయితే జీడిపప్పు, బాదం, పెకాన్స్, పొద్దుతిరుగుడు విత్తనాలు, అవిసె గింజలు, బ్రెజిల్ గింజలు, వాల్ నట్స్, గుమ్మడికాయ గింజలను రోజూ తినండి. వీటిలో పాలీఅన్శాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ ఆహారంలో ఆరోగ్యకరమైన కేలరీలను జోడిస్తాయి. రోజూ గుప్పెడు గింజలను తింటే  ఆరోగ్యం బాగుండటమే కాదు మీరు బరువు కూడా పెరుగుతారు. 
 

click me!