చర్మ ఆరోగ్యానికి చాలామంది బియ్యం నీటిని వాడుతుంటారు. బియ్యం నానబెట్టిన నీటిని లేదా ఉడికించిన తర్వాత నీటిని(గంజి) చర్మానికి ఉపయోగిస్తారు. బియ్యం నీరు చర్మాన్ని తేమగా ఉంచడంతో పాటు ముందస్తు ముడతలను నివారించడానికి సహాయపడుతుంది.
చాలా బ్యూటీ ప్రాడక్ట్స్ లో కూడా బియ్యం నీటిని ఉపయోగిస్తుంటారు. కానీ బియ్యం వాటర్ నిజంగా చర్మానికి మంచిదేనా? నిపుణులు ఏమంటున్నారో ఇక్కడ తెలుసుకుందాం.
బియ్యం నీరు చర్మానికి మంచిదేనా?
బియ్యం నీరు చర్మానికి కొన్ని ప్రయోజనాలను అందిస్తుంది. మొదటగా అవెంటో తెలుసుకుందాం.
మెరిసే చర్మం:
బియ్యం నీటిలో సహజమైన ఎంజైమ్‌లు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని ప్రకాశవంతంగా చేయడానికి, నల్ల మచ్చలను తగ్గించడానికి సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.
ముందస్తు వృద్ధాప్యాన్ని నివారిస్తుంది:
బియ్యం నీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది ముందస్తు వృద్ధాప్యాన్ని కలిగించే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడుతుంది.
చర్మపు చికాకును తగ్గిస్తుంది:
బియ్యం నీరు ముఖంపై ఎరుపు, దురదను తగ్గించడంలో సహాయపడే యాంటీఅలెర్జీ లక్షణాలను కలిగి ఉంది. ముఖ్యంగా ఇది పొడి, దురద చర్మ అలెర్జీ లాంటి సమస్యలు ఉన్నవారికి ఉత్తమమైంది.
చర్మ ఆకృతిని మెరుగుపరుస్తుంది:
సహజమైన స్టార్చ్ చర్మ రంధ్రాలను బిగించి చర్మాన్ని మృదువుగా ఉంచడానికి సహాయపడుతుంది.
చర్మాన్ని తేమగా ఉంచుతుంది:
బియ్యం నీరు సహజమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ఇది చర్మంలో తేమను నిలుపుకుంటుంది. కాబట్టి ఇది పొడి చర్మం ఉన్నవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
మొటిమలను నివారిస్తుంది:
బియ్యం నీటిలో ఉండే అస్ట్రింజెంట్ లక్షణాలు ముఖంపై ఉండే అదనపు నూనెను తగ్గించి మూసుకుపోయిన రంధ్రాలను శుభ్రం చేసి మొటిమలు రాకుండా నివారిస్తాయి.
బియ్యం నీటి వల్ల కలిగే దుష్ప్రభావాలు:
- బియ్యం నీరు ముఖానికి తేమను అందించినా, దాన్ని తరచుగా ఉపయోగించడం వల్ల పొడిబారడానికి దారితీస్తుంది. ముఖ్యంగా చర్మం పొడిగా ఉన్నవారు, దాన్ని ఎక్కువగా ఉపయోగిస్తే చర్మంలోని సహజ నూనెలు పోయి పొడిబారడం, పొలుసులు ఊడటం లాంటి సమస్యలు వస్తాయి. ఇది కొద్దిగా ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ఉపయోగిస్తే చర్మ సహజ pH సమతుల్యతను ప్రభావితం చేస్తుంది.
- బియ్యం నీటిని ముఖానికి ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేయాలి. కొంతమందికి బియ్యం నీరు అలెర్జీని కలిగిస్తుంది. దీని కారణంగా ఎరుపు లేదా చికాకు వస్తుంది.
- బియ్యం నీరు మొటిమలతో పోరాడుతుంది. కానీ సక్రమంగా ఉపయోగించకపోతే మొటిమలను కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు.
బియ్యం నీటి వల్ల కలిగే దుష్ప్రభావాలు:
- సరిగ్గా శుభ్రం చేయకుండా బియ్యం నీటిని ఎక్కువ రోజులు ఉపయోగిస్తే చర్మం రంగు మారే అవకాశం ఉందన నిపుణులు చెబుతున్నారు.
- బియ్యం నీరు సన్‌స్క్రీన్‌లలో ఒక గొప్ప పదార్థంగా ఉన్నప్పటికీ, బియ్యం నీటిని నేరుగా ముఖంపై ఉపయోగించి ఎండలో తిరగడం మంచిది కాదు. దీని వల్ల మీ చర్మాన్ని అతినీలలోహిత కిరణాలు ఎక్కువగా తాకుతాయి
- బియ్యం నీటిని తరచుగా ఉపయోగించడం లేదా ముఖంపై ఎక్కువసేపు ఉంచడం వల్ల అధికంగా ఎక్స్‌ఫోలియేట్ అవుతుంది. ఇది చర్మం సహజ అవరోధాన్ని దెబ్బతీసి సున్నితంగా మారుస్తుంది.
బియ్యం నీటిని ఉపయోగించే మార్గాలు:
టోనర్‌గా: బియ్యం నీటిలో ఒక దూదిని ముంచి మీ ముఖంపై రాయవచ్చు.
ఫేస్ మాస్క్‌గా: బియ్యం నీటిలో ముల్తానీ మట్టి లేదా కలబంద జెల్ కలిపి ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత కడగాలి.
గమనిక:
బియ్యం నీటి వల్ల ముఖంపై వచ్చే దుష్ప్రభావాలను నివారించడానికి వాటిని మీరు వారానికి 2 లేదా 3 సార్లు మాత్రమే ఉపయోగించడం మంచిదని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.