చలికాలంలో ఐస్ క్రీం తింటే ఏమౌతుంది?

First Published | Dec 2, 2024, 3:02 PM IST

ఐస్ క్రీం ఎంత టేస్టీగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే చాలా మంది ఐస్ క్రీం ను  తరచుగా తింటుంటారు. అయితే చలికాలంలో ఐస్ క్రీం ను తింటే ఏమౌతుందో తెలుసా?

కాలాలతో పాటుగా మన ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవాలంటారు. అందుకే ఈ సీజన్ లో కొన్ని ఆహారాలను తినకుండా ఉంటారు. ముందే  ఇది చలికాలం కాబట్టి వెచ్చగా ఉండేందుకు స్వెట్టర్స్ ను వేసుకుంటాం. శరీరాన్ని వేడి చేసే ఆహారాలను తింటుంటారు. అయితే ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా చలికాలంలో తినకూడని ఆహారాలను తింటే ఆరోగ్యం దెబ్బతింటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

ఐస్ క్రీం ను చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి  ఒక్కరూ ఎంతో ఇష్టంగా తింటారు. అయితే ఐస్ క్రీంను ఎండాకాలంలో రెగ్యులర్ గా తిన్నాపెద్దగా ప్రాబ్లం ఏమీ లేదు. కానీ చలికాలంలో తింటేనే సమస్య. కొంతమంది చలికాలంలో కూడా ఐస్ క్రీం ను తింటుంటారు. కొంతమంది మాత్రం చలికాలంలో ఐస్ క్రీం ను తింటే దగ్గు, జ్వరం, జలుబు చేస్తుందని తినకుండా ఉంటారు. అసలు ఈ సీజన్ లో ఐస్ క్రీంను తినాలి? వద్దా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

Latest Videos


చలికాలంలో ఐస్ క్రీం తినొచ్చా?

చలికాలంలో మొత్తమే ఐస్ క్రీం ను తినకూడదని చెప్పలేం. ఎందుకంటే మీ ఆరోగ్యం బాగుంటే ఎంచక్కా ఐస్ క్రీం ను తినొచ్చు. ముఖ్యంగా మీ ఇమ్యూనిటీ పవర్ బాగుంటే ఈ సీజన్ లో కూడా మీరు ఐస్ క్రీం ను ఎంజాయ్ చేయొచ్చు. అయితే రోజుకు లిమిట్ ను మించి ఐస్ క్రీం ను తినకూడదు. 

చలికాలంలో ఐస్ క్రీం తినడం వల్ల వచ్చే  సమస్యలు 

జీర్ణ సమస్యలు వస్తాయి: 

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. చలికాలంలో ఐస్ క్రీం ను తినకపోవడమే మంచిది. ఎందుకంటే ఈ సీజన్ లో ఐస్ క్రీంను తింటే కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం వంటి కడుపునకు సంబంధించిన సమస్యలు వస్తాయి. అంతేకాదు ఐస్ క్రీం వల్ల మీరు జీర్ణ సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. 

గొంతు నొప్పి 

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. చలికాలంలో ఐస్ క్రీం ను తింటే గొంతు నొప్పి వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఈ సీజన్ లో ఐస్ క్రీం ను తినకూడదంటారు. 

రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది

ముందు చలికాలంలో మన రోగనిరోధక శక్తి చాలా తగ్గుతుంది. ఇలాంటి సమయంలో మీరు ఐస్ క్రీం ను తింటే మీ ఇమ్యూనిటీ పవర్ మరింత తగ్గుతుంది. దీంతో మీకు దగ్గు, జలుబు, ఇన్ఫెక్షన్లు, జ్వరంతో పాటుగా ఎన్నో వ్యాధులు వస్తాయి.  

రక్త ప్రసరణ సక్రమంగా జరగదు

ఐస్ క్రీం చల్లగా ఉంటుంది. కాబట్టి మీరు చలికాలంలో చల్లగా ఉండే పదార్థాలను తింటే మీ శరీర ఉష్ణోగ్రత బాగా తగ్గుతుంది. దీంతో మీ బాడీలో రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. దీంతో మీకు కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి. 

ఇతర సమస్యలు:

చలికాలంలో ఐస్ క్రీంను తింటే పై సమస్యలే కాకుండా ఇతర సమస్యలు కూడా వస్తాయి. అవును ఐస్ క్రీంలో కూడా కెఫిన్ కంటెంట్ ఉంటుంది. ఇది చలికాలంలో మీకు తలనొప్పిని కలిగిస్తుంది. అలాగే శరీరంలో నీటి కొరత, మొటిమలు, గుండె పోటు వంటి సమస్యలను కూడా కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

click me!