వార వారం బీర్ తాగితే ఏమౌతుందో తెలుసా?

First Published | Dec 1, 2024, 2:20 PM IST

బీర్లు తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. కొంతమంది వారంలో రెండు మూడు రోజులు పక్కాగా బీర్ తాగుతుంటారు. కానీ ఆరోగ్యంగా ఉండాలంటే వారానికి ఎంత బీర్ తాగాలో తెలుసా?

ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరం అని తెలిసినప్పటికీ.. దీన్ని తాగేవారు చాలా మందే ఉన్నారు. అయితే కొంతమంది బీర్ తాగితే మంచిదేనని బాగా తాగుతుంటారు. అయితే దీన్ని లిమిట్ లో తాగితే శరీరంలో కొన్ని మంచి మార్పులు వస్తాయని కొన్ని పరిశోధనలు వెల్లడించాయి. అలాగని బీర్ ను ఎక్కువగా తాగకూడదు. ఎందుకంటే దీన్ని ఎక్కువగా తాగితే మీరు ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే బీర్ ను తాగడం ఒక అలవాటుగా మారితే కూాడా సమస్యే.

బీర్ ను తాగే అలవాటు చాలా మందికి ఉన్నా.. దీన్ని ఎంత తాగాలి అనే దాని గురించి మాత్రం ఎవ్వరికీ తెలియదు. అందుకే తాగినప్పుడల్లా రెండు మూడు సీసాల బీర్ ను లాగించేస్తుంటారు. ఇంకో నిజమేంటంటే? చాలా మంది ముందు బీర్ ను అలవాటు చేసుకుని ఆ తర్వాత ఆల్కహాల్ ను తాగడం అలవాటు చేసుకుంటున్నారు. కానీ ఇది మీ శరీరానికి అస్సలు మంచిది కాదు. 

Latest Videos


బీరును నీళ్లు, హాప్స్, ఈస్ట్, బార్లీ వంటి ధాన్యాలను పులియబెట్టి తయారు చేస్తారు. ఈ బీర్ లో ఆల్కహాల్ (ABV) 4 నుంచి 6 శాతం వరకు ఉంటుందట.

నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) నిర్వచించిన  అధ్యయనం ప్రకారం.. ఒక యూనిట్ బీర్ అంటే 10 మి.లీ లేదా 8 గ్రాముల స్వచ్ఛమైన ఆల్కహాల్ అని అర్థం. నేషనల్ హెల్త్ సర్వీస్ సిఫార్సు చేసిన పరిమితుల ప్రకారం.. ఒక వ్యక్తి వారానికి బీర్ ను 14 యూనిట్లకు మించి తాగకూడదు. అంటే ఒక వ్యక్తి ఒక రోజు 2 యూనిట్లకు మించి బీర్ ను అస్సలు తాగకూడదు. ఇది కేవలం మగవారికి మాత్రమే కాదు ఆడవారికి కూడా వర్తిస్తుంది. 

వారానికి ఎంత బీరు తాగొచ్చు?

నిపుణుల ప్రకారం.. వారంలో కనీసం రెండు రోజులైనా ఎలాంటి మందును తాగకూడదు.అంటే బీర్ ను కూడా తాగకూడదు. ఇకపోతే బీరును వారానికి 14 యూనిట్లు మాత్రమే తాగాలి. ఇంతకంటే ఎక్కువగా తాగకూడదు.

అలాగే వారం పాటు బీర్ ను తాగకూడదు. వారంలో కొన్ని రోజులు ఖచ్చితంగా బీర్ కు దూరంగా ఉండాలి. మీరు  బీరును మితంగా తాగితే గుండె జబ్బులు, ఎముకలకు సంబంధించిన ఆస్టియోపోరోసిస్ వంటివి వచ్చే ప్రమాదం తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

బీర్ ను లిమిట్ లో తాగితే మంచి కొవ్వు పరిమాణం పెరుగుతుందట. దీంతో మీకు స్ట్రోక్, గుండెపోటు వంటి ప్రాణాంతక జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. 

బీర్ ను లిమిట్ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగినప్పటికీ.. ఎక్కువగా తాగితే మాత్రం మీరు ఖచ్చితంగా ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పైన చెప్పిన మొత్తానికి మించి బీర్ ను తాగితే ప్రమాదకరమైన సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. లిమిట్ ఆల్కహాల్ ను తాగినా కూడా క్యాన్సర్‌ వస్తుంది. బీరనేది ఒక డైయూరిటిక్ పానీయం. దీన్ని తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. 

బీర్ ను తాగితే నోరు పొడిబారడం, తలనొప్పి, అలసట వంటి సమస్యలు కూడా వస్తాయి. అయితే బీర్ ను తాగిన కొద్దిసేపటికి బాగా నిద్ర వచ్చినప్పటికీ.. కొంత సేపటి తర్వాత అస్సలు నిద్రరాదు. కాబట్టి బీర్ ను అతిగా తాగకూడదు.

click me!