పళ్లు తోముకునే బ్రష్ ను బాత్ రూంలో పెడితే ఏమౌతుందో తెలుసా?

First Published | Nov 30, 2024, 4:01 PM IST

చాలా మంది పళ్లు తోముకున్న తర్వాత బ్రష్ లను బాత్రూం లేదా వాష్ బేసిన్ దగ్గరే పెడతారు. కానీ దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసా? 

రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకుంటే మన ఆరోగ్యానికి ఏ డోకా ఉండదని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెప్తుంటారు. అవును నోటిని క్లీన్ గా ఉంచుకోవడం వల్ల శరీరం ఎలాంటి రోగాలు లేకుండా హెల్తీగా ఉంటుంది. అయితే చాలా మంది రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకుంటారు.

కానీ బ్రష్ ను మాత్రం క్లీన్ గా ఉంచుకోరు. ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ టూత్ బ్రష్ ను పెడుతుంటారు. ముఖ్యంగా చాలా మందికి పళ్లు తోముకున్న తర్వాత బ్రష్ ను బాత్ రూం లేదా వాష్ బేసిన్ దగ్గర ఉంచే అలవాటు ఉంటుంది. కానీ బ్రష్ ను బాత్ రూం లో ఉంచితే ఏం జరుగుతుందో తెలుసా? 

Brushing


బాక్టీరియా

బాత్ రూంలో ఎన్నో రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. మీకు తెలుసా? మరుగుదొడ్డి మల బ్యాక్టీరియాతో పాటుగా ఎన్నో రకాల బ్యాక్టీరీయాకు సంతానోత్పత్తి ప్రదేశం. బాత్ రూం ను క్లీన్ చేసినప్పుడు దాంట్లో ఉండే బ్యాక్టీరియా, దుమ్ము కణాలు గాలిలో తేలుతాయి. అలాగే ఇవి మీ బ్రష్ కు అంటుకోవడంతో పాటుగా మళ్లీ నేలపై, గోడలపై పడతాయి. ఇలాంటి బ్రష్ తో మీరు పళ్లు తోముకోవడం వల్ల మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే అంటువ్యాధులు చుట్టుకుంటాయి. 
 


తేమ

బాత్ రూం ను ఎప్పుడూ ఉపయోగిస్తూనే ఉంటాం. కాబట్టి ఇక్కడ ఎప్పుడూ తేమగా ఉంటుంది. మీరు గనుక  బాత్ రూంలో మీరు పళ్లు తోముకునే బ్రష్ ను పెడితే బ్రష్ వెంట్రుకలు తేమగా అవుతాయి. ఈ తేమ వల్ల మీ బ్రష్ పై అచ్చు, బ్యాక్టీరియా బాగా పెరుగుతాయి. ఈ బ్రష్ తో మీరు పళ్లు తోముకుంటే మీ పళ్లు దెబ్బతింటాయి. నోటి ఆరోగ్యం రిస్క్ లో పడుతుంది. కాబట్టి బాత్ రూంలో బ్రష్ ను ఉంచకూడదంటారు.

కాలుష్యం

ఇంట్లో ఒక్కరే కాదు అందరూ బ్రష్ ను బాత్ రూం లో ఒకే హోల్డర్ లో పెడతారు.  దీనివల్ల బ్రష్ లు కలుషితమవుతాయి. అంటే అందరి టూత్ బ్రష్ లను ఒకే దగ్గర పెట్టడం వల్ల ఒక్క బ్రష్ కు ఉన్న సూక్ష్మక్రిములు ఇతర బ్రష్ లకు కూడా వ్యాపిస్తాయి. దీనివల్ల ఇంట్లో అందరికీ అంటువ్యాధులు, ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. 
 

రెస్ట్ రూమ్ దగ్గర

కొంతమంది బ్రష్ ను టాయిలెట్ దగ్గర కూడా పెడుతుంటారు. కానీ ఇది మంచి అలవాటు అస్సలు కాదు. ఎందుకంటే టాయిలెట్ ను క్లీన్ చేసినప్పుడు క్రిములు, బ్యాక్టీరియా గాలిలోకి వెళతాయి. ఈ సమయంలో మీ టూత్ బ్రష్ దగ్గర్లో ఉంటే దానికి మీ శరీరానికి హాని చేసే సూక్ష్మక్రిములు అంటుకుంటాయి. ఇలాంటి బ్రష్ తో పళ్లు తోమితే మీ  ఆరోగ్యం రిస్క్ లో పడుతుంది.
 

ఎండకు..

ఒక్క బాత్ రూంలోనే కాదు బ్రష్ ను మొత్తమే ఎండకు ఉంచినా కూడా ప్రమాదమే. ఎందుకంటే సూర్యరశ్మి నుంచి వచ్చే హానికరమైన యూవీ కిరణాలు టూత్ బ్రష్ పై చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. అంటే దీనివల్ల బ్రష్ మన దంతాలను సరిగ్గా క్లీన్ చేయలేదు. అందుకే టూత్ బ్రష్ ను ఎండలో ఉంచకూడదు. బ్రష్ ను ఎప్పుడూ కూడా పొడి, చల్లని ప్రదేశంలోనే ఉంచాలి. 

Latest Videos

click me!