ఇవి కూడా కారణం కావచ్చు...
మైగ్రేన్ సమస్యలు
మైగ్రేన్‌తో బాధపడేవారిలో ఉదయం తలనొప్పి సర్వసాధారణం. నిద్రలేమి, ప్రకాశవంతమైన కాంతి, మారుతున్న వాతావరణం , ఖాళీ కడుపుతో నిద్రపోవడం వంటివి మైగ్రేన్‌ను ప్రేరేపిస్తాయి, దీనివల్ల ఉదయం తీవ్రమైన నొప్పి వస్తుంది.
స్లీప్ అప్నియా
స్లీప్ అప్నియా వల్ల నిద్రలో శ్వాస మధ్యమధ్యలో ఆగిపోతుంది, దీనివల్ల శరీరానికి తగినంత ఆక్సిజన్ అందదు. ఇది నిద్రలేచినప్పుడు తీవ్రమైన తలనొప్పి, మైకం , నీరసానికి కారణమవుతుంది.
డీహైడ్రేషన్ సమస్య ఉంటే
రాత్రిపూట నీరు తాగకపోవడం , శరీరంలో ద్రవాల స్థాయి తక్కువగా ఉండటం వల్ల రక్తనాళాలు సంకోచిస్తాయి, ఇది మెదడుకు తగినంత ఆక్సిజన్ అందకుండా చేసి తలనొప్పికి కారణమవుతుంది.
ఆల్కహాల్ లేదా కెఫీన్ ప్రభావాలు
రాత్రిపూట ఆల్కహాల్ తాగడం లేదా అధిక కెఫీన్ ఉన్న పానీయాలు సేవించడం వల్ల నిద్ర సమస్యలు వస్తాయి. నిద్ర పట్టడం కష్టమవుతుంది. దీని కారణంగా ఉదయాన్నే నిద్రలేచినప్పుడు తలనొప్పి రావచ్చు.