Health: చాయ్‌తో వీటిని క‌లిపి తింటున్నారా.? తీవ్ర స‌మ‌స్య‌లు త‌ప్ప‌వు

Published : Dec 14, 2025, 01:40 PM IST

Health: మ‌న‌లో చాలా మందికి టీ తాగ‌నిది ఉద‌యం మొద‌లు కాదు. కొంద‌రు టీలో ఏదో ఒక‌టి ముంచుకుని తింటుంటారు. అయితే కొన్ని ర‌కాల ఆహార ప‌దార్థాలు మాత్రం ఆరోగ్యంపై తీవ్ర ప్ర‌భావాన్ని చూపుతాయ‌ని నిపుణులు చెబుతున్నారు. 

PREV
15
టీ, కాఫీతో తినే కాంబినేషన్లపై జాగ్రత్త

చాలామంది రోజును టీ లేదా కాఫీతోనే ప్రారంభిస్తారు. కొందరికి అది అలవాటు, మరికొందరికి ఎనర్జీ. అయితే టీ–కాఫీతో పాటు తినే కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి మెల్లగా నష్టం కలిగిస్తాయన్న విషయం చాలా మందికి తెలియదు. ఈ తప్పు కాంబినేషన్లు గ్యాస్, ఆసిడిటీ, పోషక లోపాలు, హార్మోన్ల అసమతుల్యతకు కూడా కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు.

25
డీప్ ఫ్రై చేసిన స్నాక్స్ ప్రమాదకరం

టీతో సమోసా, బ్రెడ్ పకోడా వంటి నూనెలో వేయించిన పదార్థాలు చాలామందికి ఇష్టం. కానీ ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. టీ లో ఉండే టానిన్, నూనెతో కలిసినప్పుడు గ్యాస్, పొట్ట ఉబ్బరం, ఆసిడిటీ సమస్యలు తలెత్తుతాయి. అంతేకాదు, శరీరానికి అవసరమైన ఐరన్ శోషణ కూడా తగ్గిపోతుంది.

35
ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారాలతో

టీ లేదా కాఫీతో ఐరన్ అధికంగా ఉండే ఆహారాలను తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. టీ లో ఉండే ఆక్సలేట్, ఐరన్ శోషణను అడ్డుకుంటుంది. దీని వల్ల శరీరంలో ఐరన్ లోపం వచ్చే అవకాశం ఉంది. అందుకే ఆకుకూరలు, గింజలు వంటి ఐరన్ ఆహారాలను టీకి కొంత గ్యాప్ ఇచ్చి తీసుకోవాలి.

45
పెరుగు పదార్థాలతో కలిపితే సమస్యలు

టీ లేదా కాఫీతో పెరుగు లేదా పెరుగు కలిపిన వంటకాలు తీసుకోవడం మంచిది కాదు. టీ శరీరాన్ని వేడిగా చేస్తే, పెరుగు చల్లదనం కలిగిస్తుంది. ఈ విరుద్ధ స్వభావాల కలయిక వల్ల కడుపు మంట, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. ఈ అలవాటు ఉంటే వెంటనే మానేయడం మంచిది.

55
టీ–బిస్కెట్లు కూడా మంచి కాంబినేషన్ కాదు

చాలామంది టీతో బిస్కెట్లు తినడం అలవాటు. కానీ ఇది కూడా ఆరోగ్యానికి హానికరం. బిస్కెట్లలో మైదా, చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి టీతో కలిసినప్పుడు రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉంది. దీని వల్ల డయాబెటిస్ సమస్య ఉన్నవారికి మరింత ఇబ్బంది కలగొచ్చు.

గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం.

Read more Photos on
click me!

Recommended Stories