మనలో చాలా మంది పాలను తీసుకొచ్చిన వెంటనే వాటిని అలాగే ఫ్రిజ్ లో పెడుతుంటారు. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. పచ్చి పాలను అలాగే ఫ్రిజ్ లో స్టోర్ చేస్తే ఏమవుతుందంటే.
సాధారణంగా పాలు ఇచ్చే జంతువులకు ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే, ఆ వైరస్ పాలలో కూడా చేరుతుంది. పాలను మరిగించకుండా ఫ్రిజ్ లో నేరుగా పెడితే ఆ వైరస్ సజీవంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా పాలలో ఉండే ఈ వైరస్ కారణంగా చలికాలంలో వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే పాలను కచ్చితంగా మరిగించిన తర్వాతే ఫ్రిజ్ లో పెట్టాలని సూచిస్తున్నారు.
పాలు నిల్వ చేయడం ఎలా?
పాలను నిల్వ చేసే ముందు కచ్చితంగా మరిగించాలని చెబుతున్నారు. ఇలా చేస్తే పాలలో ఉండే బ్యాక్టీరియా, వైరస్ నాశనం అవుతుంది. ఇక ఎట్టి పరిస్థితుల్లో పచ్చి పాలను నేరుగా తాగకూడదని చెబుతున్నారు.
అప నమ్మకాలు..
అయితే పచ్చి పాలలో ఎక్కువ పోషకాలు ఉంటాయని కొందరు నమ్ముతారు. కానీ ఇందులో ఏమాత్రం నిజం లేదని నిపుణులు చెబుతున్నారు. పచ్చి పాలు తాగితే 200 కంటే ఎక్కువ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. అందుకే పాలను మరిగిస్తేనే వైరస్ పూర్తిగా నాశనం అవుతుందని చెబుతున్నారు.