Glowing face: రాత్రి పడుకునే ముందు ఈ 5 చేస్తే.. ముఖం అందంగా మెరిసిపోతుంది!

Published : Apr 03, 2025, 03:40 PM IST

ఎప్పుడూ అందంగా, యవ్వనంగా ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి. కానీ ప్రస్తుత లైఫ్ స్టైల్ కి అది సాధ్యమేనా? చిన్న వయసులోనే మొహం మీద ముడతలు, మచ్చలు రావడం, ముఖం కళావిహీనంగా మారడం లాంటి సమస్యలు చాలామంది ఎదుర్కొంటున్నారు. అయితే రాత్రి పడుకునే ముందు కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా మీ ముఖాన్ని కాంతివంతంగా చేసుకోవచ్చు. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
16
Glowing face: రాత్రి పడుకునే ముందు ఈ 5 చేస్తే.. ముఖం అందంగా మెరిసిపోతుంది!

ఆధునిక జీవనశైలి కారణంగా 30 ఏళ్లకే ముఖం కళావిహీనంగా మారుతోంది. చాలా కాలం అందంగా ఉండాలంటే కొన్ని అలవాట్లు చేసుకోవాలి అంటున్నారు నిపుణులు. రాత్రిపూట చర్మ సంరక్షణ ముఖానికి నిగారింపునిస్తుందని చెబుతున్నారు. అందుకోసం ఏం చేయాలి? ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇక్కడ చూద్దాం.

26
చర్మ సంరక్షణ కోసం..

రాత్రి పడుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. దీనివల్ల ముఖంపై ఉండే దుమ్ము, ధూళి, మలినాలు తొలగిపోతాయి. చర్మ రంధ్రాలపై పేరుకున్న అదనపు నూనె తొలగిపోతుంది. ముఖం శుభ్రం చేయడానికి మీ చర్మానికి సరిపోయే క్లెన్సర్ వాడండి. నిపుణుల సలహా తీసుకుని క్లెన్సర్ ఎంచుకోవడం మంచిది.

36
చర్మం మెరుపు కోసం..

ముఖం కాంతిగా ఉండాలంటే ఎక్స్‌ఫోలియేట్ చేసుకోవాలి. ఇది మీ ముఖంపై ఉండే డెడ్ స్కిన్ తొలగించడానికి సహాయపడుతుంది. ఎక్స్‌ఫోలియేట్ చేసుకున్నప్పుడు మీ చర్మం మెరుస్తుంది. వారానికి రెండుసార్లు ఎక్స్‌ఫోలియేట్ చేసుకుంటే మీ చర్మం అందంగా ఉంటుంది. 

46
టోనర్ల వాడకం

క్లీనింగ్, ఎక్స్‌ఫోలియేట్ చేసుకున్న తర్వాత టోనర్ వాడటం చాలా ముఖ్యం. టోనర్ మీ చర్మం సహజ pH స్థాయిని కాపాడుతుంది. టోనర్ వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

56
సీరం వాడకం

చర్మ సమస్యల నివారణకు సీరం వాడాలి. చిన్న గీతలు, ముడతలు, అసమాన చర్మం టోన్ సమస్యను తొలగించడానికి సీరం సహాయపడుతుంది. రెటినాల్ లేదా విటమిన్ సి లాంటి పవర్‌ఫుల్ సీరం వాడటం మంచిది.

66
మాయిశ్చరైజర్

చర్మం పొడిబారకుండా, తాజాగా కనిపించడానికి మాయిశ్చరైజర్ వాడాలి. మాయిశ్చరైజర్ రాసుకోవడం వల్ల ముఖంపై గీతలు, ముడతలు తగ్గుతాయి. సహజ నూనెలు కలిగిన మాయిశ్చరైజర్ వాడటం చర్మ ఆరోగ్యానికి మంచిది.

Disclaimer:ఈ సమాచారం ఇంటర్నెట్‌లో ఉన్న సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీన్ని ఏషియానెట్ న్యూస్ ధృవీకరించడం లేదు.

Read more Photos on
click me!

Recommended Stories