రోజూ పరగడుపున మునగ ఆకు నీళ్లను తాగితే ఈ సమస్యలన్నీ దూరం

Published : Sep 09, 2025, 10:46 AM IST

ముగన ఆకుల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇవి మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అయితే చాలా మంది మునక పొడిని మాత్రమే తీసుకుంటుంటారు. కానీ మునగ ఆకు నీళ్లు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని తాగితే ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది.

PREV
16
ముగన ఆకు

మునగ ఆకులు మన ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో. వీటిలో మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఈ ఆకుల్లో ఐరన్, పొటాషియం, కాల్షియం, విటమిన్ ఎ, విటమిన్ సి వంటి ఎన్నో రకాల ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అయితే చాలా మంది మునగ ఆకును పొడిగా తీసుకుంటుంటారు. కానీ మీరు ఈ ఆకుల నీళ్లను తాగినా మంచిదే. మునగ ఆకు నీళ్లను మీరు గనుక పరిగడుపున తాగితే ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.

26
మునగ ఆకుల నీళ్లను తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి

మునగ ఆకు నీళ్లలో రకరకాల విటమిన్లు, ఇనుము పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రక్తాన్ని పెంచుతాయి. అలాగే అలసటను తగ్గించడానికి సహాయపడతాయి. ఈ నీళ్లను పరిగడుపున తాగడం వల్ల మీ శక్తి స్థాయిలు బాగా పెరుగుతాయి. దీంతో మీరు రోజంతా ఎనర్జిటిక్ గా పనులు చేసుకుంటారు.

36
బలమైన జీర్ణవ్యవస్థ

పరిగడుపున మునగ ఆకుల నీళ్లను తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన కడుపులోని హానికరమైన బ్యాక్టీరియాను తొలగించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఈ వాటర్ లో ఉండే ఫైబర్ కంటెంట్ మలబద్దకం సమస్యను తగ్గించడానికి సహాయపడుతుంది. దీంతో కడుపు శుభ్రంగా ఉంచుతుంది.

46
బరువు తగ్గడానికి సహాయపడుతుంది

బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఈ వాటర్ ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ వాటర్ లో కేలరీలు తక్కువగా, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వాటర్ ను పరిగడుపున తాగితే జీవక్రియ పెంచి శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ వాటర్ ను తాగడం వల్ల మీ కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది.

56
ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది

మునగ ఆకుల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి బాగా సహాయపడతాయి. కాబట్టి మీరు ఈ వాటర్ ను రెగ్యులర్ గా తాగడం వల్ల దగ్గు, జలుబు వంటి ఇన్ఫెక్షన్ల ప్రమాదం తగ్గుతుంది.

షుగర్, కొలెస్ట్రాల్ తగ్గుతాయి

డయాబెటీస్ ఉన్నవారికి, శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారికి ఈ మునగ ఆకు వాటర్ ఎంతో ప్రయోజకరంగా ఉంటుంది. ఈ వాటర్ ను పరిగడుపున తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. శరీరంలో కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. దీంతో మీ గుండె హెల్తీగా ఉంటుంది. అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ తగ్గుతుంది.

66
చర్మం, జుట్టుకు మంచిది

మునగ ఆకుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ వాటర్ ను తాగడం వల్ల మన చర్మం తేమగా, ఆరోగ్యంగా ఉంటుంది. మంచి గ్లో వస్తుంది. అలాగే మొటిమలు, ముడతలు తగ్గుతాయి. ఇక ఈ ఆకుల్లో ఉండే పోషకాలు జుట్టును బలంగా చేస్తాయి. అలాగే హెయిర్ ఫాల్ తగ్గుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories