లెమన్ వాటర్ వర్సెస్ కొకొనట్ వాటర్.. ఆరోగ్యానికి ఏది బెస్ట్

Published : Aug 23, 2025, 02:59 PM IST

కొంతమంది లెమన్ వాటర్ ను బాగా తాగితే మరికొంతమంది కొకొనట్ వాటర్ ను ఇష్టంగా తాగుతుంటారు. అయితే రెండింటిలో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మంచి చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.. 

PREV
17
కొబ్బరి నీళ్లు

నిమ్మకాయ నీళ్లు, కొబ్బరి నీళ్లు రెండూ ఆరోగ్యకరమైనవే. వీటిని ఒక్క ఎండాకాలంలోనే కాదు ఇతర సీజన్లలో కూడా తాగొచ్చు. వీటిని తాగితే బరువు తగ్గడం నుంచి బాడీ హైడ్రేట్ గా ఉండటం వరకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతాం. అయితే ఈ రెండి పానీయాల్లో ఏది ఆరోగ్యకరమైందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

27
కొబ్బరి నీరు వర్సెస్ నిమ్మకాయ నీరు - ఏది ఆరోగ్యకరమైనది

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. నిమ్మకాయ నీళ్లు, కొబ్బరి నీళ్లు రెండూ ఆరోగ్యకరమైనవే. కానీ వీటి వల్ల కలిగే ప్రయోజనాలు భిన్నంగా ఉంటాయి. కొబ్బరి నీళ్లలో మెగ్నీషియం, ఎలక్ట్రోలైట్స్. పొటాషియం మెండుగా ఉంటాదయి. ఈ కొబ్బరి నీళ్లు బీపీని కంట్రోల్ చేస్తుంది. 

అలాగే శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. కండరాల తిమ్మిరిని తగ్గిస్తుంది. అంతేకాదు కొబ్బరి నీళ్లు మన మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇకపోతే నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఇది మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచి మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంచుతుంది. మన జీర్ఱక్రియ మెరుగుపడేందుకు సహాయపడుతుంది.

37
కొబ్బరినీళ్లు

ఇకపోతే కొబ్బరి నీళ్లు, నిమ్మకాయ నీళ్లు రెండూ మన జీవక్రియను పెంచి బరువు తగ్గడానికి సహాపడతాయి. అయితే ఎలక్ట్రోలైట్స్ అసమతుల్యంగా ఉన్నవారికి కొబ్బరినీరు మంచిది. అలాగే విటమిన్ సి, జీవిక్రియను పెంచుకోవడానికి లెమన్ వాటర్ వంచివి. ఈ రెండూ హెల్తీవే కాబట్టి మీ శరీర అవసరాలకు తగ్గట్టు వీటిని తాగితే మంచిది.

47
కొబ్బరి నీళ్ల వల్ల కలిగే ప్రయోజనాలు

శరీరం హైడ్రేట్ గా ఉంటుంది

కొకొనట్ వాటర్ లో వాటర్ కంటెంట్ మెండుగా ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని తాగితే మీ శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. అలాగే మీ శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్స్ ను కూడా అందిస్తుంది. డీహైడ్రేషన్ కాకుండా ఉండటానికి ఇదొక గొప్ప డ్రింక్.

బరువు తగ్గడానికి

బరువు తగ్గాలనుకునేవారికి కొబ్బరి నీరు కూడా మంచిది. ఎందుకంటే వీటిలో ట్రాన్స్ ఫ్యాట్స్, కొలెస్ట్రాల్ ఉండవు. కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు దీన్ని తాగుతూ సులువుగా బరువు తగ్గొచ్చు. నిపుణుల ప్రకారం.. ఇది మంచి శక్తి బూస్టర్. దీన్ని తాగితే ఆకలి తగ్గడమే కాకుండా.. అనారోగ్యకరమైన ఆహారాలను తినే అలవాటు తగ్గుతుంది.

57
ఇమ్యూనిటీ పవర్ బలోపేతం

కొకొనట్ వాటర్ లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ కొబ్బరి నీళ్లను తాగితే మన రోగనిరోధక శక్తి బలంగా అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అంటే ఈ వాటర్ ను తాగితే మన శరీరం ఎన్నో వ్యాధులకు దూరంగా ఉంటుంది.

బీపీ కంట్రోల్ లో ఉంటుంది

బీపీ పేషెంట్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రక్తపోటు పెరిగితే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. అయితే ఈ రక్తపోటును అదుపులో ఉంచడానికి కొబ్బరి నీళ్లు బాగా సహాయపడతాయి. ఈ వాటర్ లో ఉండే పొటాషియం అధిక రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది. బీపీ పెరిగే ప్రమాదాన్ని తగ్గించడంలో కొబ్బరి నీళ్లు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి.

67
లెమన్ వాటర్ ప్రయోజనాలు

రీఫ్రెష్ చేస్తుంది

నిమ్మరసం తాగడం వల్ల బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. దీన్ని తాగితే మానసిక అలసట తగ్గుతుంది. అలాగే రీఫ్రెష్ అనుభూతి కలుగుతుంది. దీన్ని తాగడం వల్ల మనం ఫ్రెష్ గా ఫీలవుతాం.

77
జీర్ణక్రియ మెరుగపడుతుంది

నిమ్మకాయ నీళ్లు జీర్ణక్రియను మెరుగుపర్చడానికి సహాయపడతాయి. అలాగే కడుపు అసౌకర్యాన్ని, చిరాకును తగ్గించడానికి సహాయపడుతుంది. అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలతో బాధపడేవారికి ఇది బెస్ట్ డ్రింక్.

బరువు తగ్గడానికి సహాయపడుతుంది

కొకొనట్ వాటర్ లాగే నిమ్మకాయ నీళ్లు కూడా మీరు హెల్తీగా బరువు తగ్గడానికి సహాయపడతాయి. నిమ్మకాయ నీళ్లను తాగితే జీవక్రియ పెరుగుతుంది. దీంతో కేలరీలు ఫాస్ట్ గా కరుగుతాయి. అలాగే ఆకలి కంట్రోల్ ఉంటుంది. దీన్ని తాగడం వల్ల మీరు అతిగా తినలేరు.

Read more Photos on
click me!

Recommended Stories