COVID variant JN.1: మళ్లీ మొదలైన కరోనా భయం.. కరోనా కొత్త వేరియంట్ లక్షణాలు ఎలా ఉంటాయంటే?

First Published | Dec 19, 2023, 2:03 PM IST

COVID variant JN.1: ఇక భయపడక్కర్లేదు అనుకున్న సమయంలోనే.. మళ్లీ జనాలను తీవ్ర భయబ్రాంతులకు గురిచేస్తోంది కరోనా కొత్త వేరియంట్. నిపుణుల ప్రకారం.. ఈ కొత్త వేరియంట్ మునపటి వాటికంటే చాలా ఫాస్ట్ గా వ్యాపిస్తుందట. అలాగే..
 

COVID-19 sub variant JN.1 05

COVID variant JN.1: కేరళతో సహా కరోనా దేశం మొత్తం మీద కేసులు బాగా పెరిగిపోతుండటంతో జనాలు తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారు. కరోనా చేసిన నష్టాలు.. ఇప్పటికీ జనాల కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇక దీని భయం మనకు అక్కర్లేదు అనుకున్న సమయంలోనే మళ్లీ కరోనా వ్యాప్తి మొదలైంది. ఈ వేరియంట్ మునపటిలానే ఉంటుందా? అన్న అనుమానం జనాలను తీవ్రంగా భయపెడుతోంది. 

COVID-19 sub variant JN.1 08

తాజా వేరియంట్లలో ఒకటైన జేఎన్ 1 గురించి పూర్తి సమాచారం ఇంకా అందుబాటులో లేదు. అయితే పరిశోధకులు ఇప్పటికే చెప్పిన విషయమేంటంటే? ఇది మనల్ని మరీ డేంజర్ లో ఉంచే విధంగా ప్రభావితం చేసే వైరస్ కాదు. కానీ వ్యాధులు, అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ వైరస్ యాక్టివిటీ ఇలాంటి వారిలోనే మారుతుంది.

Latest Videos


COVID-19 sub variant JN.1 06

గతంలో కొవిడ్ బారిన పడినవారు, వ్యాక్సిన్ వేయించుకున్న వారి శరీరంలోకి కూడా ఈ వైరస్ ప్రవేశించొచ్చు. వ్యాక్సిన్ వేయించుకున్నా ప్రయోజనం లేదనుకుంటే పొరపాటే. కానీ ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవారికి ఇది వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే ఇమ్యూనిటీని పెంచే ఆహారాలను తినాలి. 
 

covid jn 1

ఇక ఈ కొత్త వేరియంట్ లక్షణాలు ఎలా ఉంటాయంటే? 

దీనిలో చాలా లక్షణాలు మునుపటి కోవిడ్ లక్షణాల మాదిరిగానే ఉంటాయి. అయితే జుఎన్ 1 లో ఒక లక్షణం ఎక్కువగా కనిపిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. అదేంటంటే? పొట్ట ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు. అజీర్ణం, పొత్తికడుపు నొప్పి, విరేచనాలు దీనిలో ఉంటాయి.  అయితే ఈ కరోనా కొత్త వేరియంట్ కు భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.అయితే దీనిపై మరిన్ని అధ్యయనాలు జరిగితే ఈ వేరియంట్ గురించి మరింత స్పష్టత వస్తుందని నిపుణులు చెబుతున్నారు. 
 

COVID-19 sub variant JN.1 05

ప్రస్తుతం అమెరికాలో నమోదవుతున్న మొత్తం కరోనా కేసుల్లో 15-29 శాతం కేసులు జేఎన్ 1 కారణంగానే నమోదవుతున్నాయట. కానీ అక్కడ అత్యవసర పరిస్థితి ఏం లేదు. ఇది కాస్త ఉపశమనం కలిగించే అంశమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
 

click me!