వాతావరణం మారినప్పుడు.. ముఖ్యంగా చలికాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అందులోనూ ఈ సీజన్ లో మన రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీనివల్ల అకస్మాత్తుగా వ్యాధుల బారిన పడతాం. వాతావరణం మారుతున్నప్పుడు మన రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా చాలా ముఖ్యం. లేదంటే ఈ సీజన్ మొత్తం ఆనారోగ్యంగానే ఉండాల్సి వస్తుంది. అయితే ఆహారంతో మన ఇమ్యూనిటీ పవర్ తిరిగి పెంచొచ్చు. ఇందుకోసం ఎలాంటి పానీయాలను తాగాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఒక విషయం...
పసుపు పాలు
పసుపు పాలు మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. పాలలో, పసుపులో మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో రకాల పోషకాలుంటాయి. అలాగే పసుపులో కర్కుమిన్ అనే శక్తివంతమైన సమ్మేళనం ఉంటుంది. అందుకే ఈ పాలను తాగితే ఈ సీజన్ లో మన రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉంటుంది. అలాగే బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్లను నివారించడానికి కూడా ఇది సహాయపడుతుంది.
Ginger Tea
అల్లం టీ
అల్లం టీ లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. దీనిని తాగితే మనం ఎన్నో అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంటాం. ముఖ్యంగా జలుబు చేయదు. అల్లంలో ఉండే జింజెరోల్ మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
తులసి టీ
తులసి దివ్య ఔషదాలున్న మొక్క. ఈ మొక్క ఆకులతో టీని తయారుచేసుకుని తాగితే ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. యాంటీమైక్రోబయల్ లక్షణాలున్న తులసి టీ మన రోగనిరోధక శక్తిని కూడా పెంచడానికి సహాయపడుతుంది.
గ్రీన్ టీ
ప్రస్తుత కాలంలో గ్రీన్ టీ ని తాగేవారు ఎక్కువయ్యారు. ఇది మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. ఇది బరువును తగ్గించడానికి కూడా ఎంతగానో సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న గ్రీన్ టీ మన రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది.
లెమన్ వాటర్
బరువు తగ్గడానికని చాలా మంది ఉదయాన్నే గోరువెచ్చని నిమ్మకాయ నీటిని తాగుతుంటారు. అయితే ఇది మన ఆరోగ్యాన్ని కాపాడటానికి కూడా సహాయపడుతుంది. విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఈ వాటర్ లో పుష్కలంగా ఉంటాయి. దీన్ని రెగ్యులర్ గా తాగితే కూడా మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
మెంతి వాటర్
మెంతుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటయి. ఇలాంటి మెంతులను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నేవడకట్టి ఆ నీటిని తాగితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. వీటిలో ఇమ్యూనిటీ పెరగడం ఒకటి.
దాల్చిన చెక్క కలిపిన పాలు
పాలలో దాల్చిన చెక్క పొడి కలిపి తాగడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పానీయాన్ని తాగడం వల్ల కూడా మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవే ఇందుకు సహాయపడతాయి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, డాక్టర్ లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే మీ రోజువారి ఆహారపు అలవాట్లను మార్చండి.