ప్రస్తుతం చాలామంది జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా గ్యాస్, కడుపులో మంట, ఉబ్బరం వంటివి చాలామందిని ఇబ్బంది పెడుతున్నాయి. అయితే కొన్ని ఇంటి చిట్కాలతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు అంటున్నారు నిపుణులు. అవేంటో ఇక్కడ చూద్దాం.
మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి ఇతర కారణాల వల్ల గ్యాస్, కడుపులో మంట, ఆమ్లత్వం వంటి సమస్యలు చాలామందికి ఎదురవుతుంటాయి. అయితే ఇంట్లో ఉండే కొన్ని సహజ పదార్థాలను ఉపయోగించి ఈ సమస్యను ఈజీగా తగ్గించుకోవచ్చు. ఎలాగో ఇక్కడ చూద్దాం.
26
చల్లని పాలు
గ్యాస్, కడుపులో మంట వెంటనే తగ్గాలంటే.. సగం కప్పు చల్లని పాలు తాగితే చాలని చెబుతున్నారు నిపుణులు. పాలలో ఉన్న కాల్షియం, ప్రోటీన్లు కడుపులోని ఆమ్లాన్ని కొంతవరకు నిర్జీవం చేస్తాయి. దానివల్ల కొద్దిసేపటికి కడుపులో మంట తగ్గుతుంది. అయితే లాక్టోస్ అసహనం ఉన్నవారు పాలు తాగితే ఈ సమస్య మరింత పెరగవచ్చు.
36
అరటి పండు
కడుపులో మంట, గ్యాస్ సమస్యలు వచ్చినప్పుడు అరటి పండు తినడం చాలామంచిది. అరటిలో సహజమైన యాంటాసిడ్ లక్షణాలు ఉండటం వల్ల కడుపులోని ఆమ్లాన్ని సమతుల్యం చేసేందుకు సహాయపడతాయి. అరటిలో ఉండే ఫైబర్ కడుపు గోడను రక్షించే పొరలా పనిచేసి దురద, మంటలను తగ్గించడంలో సహాయపడుతుంది.
కొబ్బరి నీళ్లు సహజ ఆల్కలైన్ లక్షణాలు కలిగి ఉండడం వల్ల కడుపులో అధికంగా ఉత్పత్తి అయ్యే ఆమ్లాలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి కడుపు గోడను శాంతపరిచి మంటను తగ్గించడానికి సహాయపడతాయి. అంతేకాదు కొబ్బరి నీళ్లలో ఉండే పొటాషియం, ఎలక్ట్రోలైట్లు, మైక్రోన్యూట్రియెంట్స్ శరీరంలోని ద్రవాలను సమతుల్యం చేస్తాయి.
56
తేనె, గోరువెచ్చని నీరు
గోరువెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ తేనె కలిపి తాగితే చాలామందికి గ్యాస్, మంట నుంచి ఉపశమనం కలుగుతుంది. గోరువెచ్చని నీరు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తేనెలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కడుపు గోడను శాంతపరచడంలో సహాయపడతాయి. అయితే డయాబెటిస్ ఉన్నవారు తేనె వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
66
జీలకర్ర, మజ్జిగ
మజ్జిగలో కొంచెం జీలకర్ర కలిపి తాగడం వల్ల గ్యాస్, కడుపులో మంట తగ్గుతాయి. మజ్జిగలోని సహజ ప్రోబయాటిక్స్ వల్ల జీర్ణక్రియ మెరుగుపడి అసిడిటీ తగ్గే అవకాశం ఉంటుంది. జీలకర్రలో ఉండే కార్మినేటివ్ గుణాలు కడుపు ఉబ్బరం తగ్గిస్తాయి.