Breast Cancer: ఇంట్లోనే 2 నిమిషాల్లో.. బ్రెస్ట్ కాన్సర్‌ని చెక్ చేసుకోండిలా..

Published : Jun 17, 2025, 10:25 AM IST

Breast Cancer: మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల్లో బ్రెస్ట్ కాన్సర్ ఒకటి. దీనిని ముందుగానే గుర్తించకపోతే ప్రాణాలకే ప్రమాదం. బ్రెస్ట్ క్యాన్సర్ ఉందా? లేదా ? అనేది ఇంట్లో కూడా సులభంగా పరీక్షించుకోవచ్చు. అది కూడా కేవలం 2నిమిషాల్లోనే. అదెలానో తెలుసుకోండి..

PREV
19
బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదమే..

బ్రెస్ట్ క్యాన్సర్ స్త్రీలలో అత్యంత సాధారణమైన, ప్రమాదకరమైన క్యాన్సర్‌లలో ఒకటి. ప్రతి సంవత్సరం చాలా మంది స్త్రీలు దీని బారిన పడుతున్నారు. అయితే.. ఈ వ్యాధిని ఆలస్యంగా గుర్తించడం వల్ల చాలామంది  తమ ప్రాణాలను కోల్పోతున్నారు. అందువల్ల స్త్రీలు ఈ వ్యాధి గురించి అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. తద్వారా దాని లక్షణాలను సకాలంలో గుర్తించి చికిత్సను ప్రారంభించవచ్చు.

29
ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

ప్రపంచవ్యాప్తంగా బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదిక ప్రకారం.. 2050 నాటికి ప్రతి సంవత్సరం దాదాపు 3.2 మిలియన్ల కొత్త బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు నమోదవుతాయి. రాబోయే రోజుల్లో ఈ వ్యాధి ఎంత ప్రమాదకరంగా మారుతుందో, ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశముందని హెచ్చరించింది. అటువంటి పరిస్థితిలో ఈ వ్యాధిని సకాలంలో గుర్తిస్తే.. ఈ వ్యాధికి చికిత్స చేయవచ్చు.

39
ప్రారంభ దశలో గుర్తించండి

బ్రెస్ట్ ను మనం సొంతంగా పరీక్ష చేసుకోవడం వల్ల ముందుగా బ్రెస్ట్ కాన్సర్ ను గుర్తించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తించడం కోసం దాన్ని తగ్గించడం కోసం మనం సొంతంగా బ్రెస్ట్ ఎగ్జామ్ చేసుకోవడం ఎంత ముఖ్యమైనదో కొన్ని సంవత్సరాల నుండి అధ్యనాలు జరుగుతున్నాయి.

49
అప్రమత్తంగా

ప్రస్తుతం భారతదేశంలో చాలామంది మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ బారినపడుతున్నారు. ఈ క్యాన్సర్ కారణంగా స్త్రీల మరణాల రేటు కూడా చాలా ఎక్కువగా ఉండటం ఆందోళనకరం. ఇలాంటి పరిస్థితిలో, స్త్రీలు ఈ వ్యాధి గురించి అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం.

59
లక్షణాలు

స్త్రీలు ప్రతి నెలా క్రమం తప్పకుండా తమ బ్రెస్ట్‌లను పరీక్షించుకోవాలని చెబుతున్నారు. బెస్ట్ కాన్సర్  లక్షణాలను గుర్తించడానికి సులభమైన, ముఖ్యమైన మార్గాలివే. 

69
స్వీయ పరీక్ష

35 ఏళ్లు పైబడి వారు ఋతుచక్రం ముగిసిన తర్వాత ప్రతి నెలా సెల్ప్ గా బ్రెస్ట్ పరీక్ష చేసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఈ ప్రక్రియ రుతుక్రమం తర్వాత రోజులు ఉత్తమం ఎందుకంటే ఆ సమయంలో బ్రెస్ట్ కణజాలం మృదువుగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో గుర్తించడం సులభం అవుతుంది.

79
ఇలా పరీక్షించుకోండి..

ముందుగా అద్దం ముందు నిల్చుని చేతులని నడుముపై ఉంచి బ్రెస్ట్‌ని చూడండి. రెండింటి పరిమాణం, ఆకారం, రంగులో ఏదైనా వ్యత్యాసం ఉందా? అనే గమనించండి. ఏదైనా భాగం కుంచించుకుపోయిందా? చర్మంపై ఏదైనా కుంగుబాటు లేదా ఉబ్బరం ఉందా? అని చూడండి. అలాగే చనుమొనలు సాధారణంగా ఉన్నాయా? లేదా? లోపలికి వంగి ఉన్నాయా? ఎరుపు, పుండ్లు పడటం, దద్దుర్లు లేదా వాపు ఉండటం అని కూడా చూడండి. 

89
స్పర్శ పరీక్ష

మీరు రెండు బ్రెస్ట్‌లను పరీక్షించిన తర్వాత, తదుపరి దశ స్పర్శ పరీక్ష చేయండి. అంటే.. చేతితో తాకి పరీక్షించాలి. ఈ ప్రక్రియలో మీరు వేళ్ల సహాయంతో వృత్తాకార కదలికలో బ్రెస్ట్‌ను నొక్కి పరీక్షించాలి. కింది నుండి పైకి పరీక్షించుకోవాలి. ఆపై కుడి లేదా ఎడమ వైపు జాగ్రత్తగా పరీక్షించండి. బ్రెస్ట్‌లో ఏదైనా గడ్డలు లేదా వాపు ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి. 

99
స్నానం చేసేటప్పుడు

స్నానం చేసేటప్పుడు స్వీయ బ్రెస్ట్ పరీక్ష చేసుకోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే ఆ సమయంలో శరీరం తడిగా ఉంటుంది. చేతుల్లో సబ్బు ఉండటం వల్ల చేతులు చర్మంపై సులభంగా జారుతాయి, ఇది ఏదైనా గడ్డను గుర్తించడాన్ని సులభతరం చేస్తుంది. లేదా  మీ చేతిలో కొద్దిగా నూనె లేదా లోషన్ తీసుకుని పరీక్షించండి. ఈ విధంగా మీరు లక్షణాల గురించి తెలుసుకోవడం ద్వారా అప్రమత్తంగా ఉండవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories