పళ్లు తోముకోవడానికి ఎక్కువ టూత్ పేస్ట్ ను వాడితే ఏమౌతుందో తెలుసా?

First Published | Nov 8, 2024, 3:25 PM IST

పళ్లను తోమడానికి ప్రతి ఒక్కరూ టూత్ పేస్ట్ ను ఉపయోగిస్తారు. మార్కెట్ లో ఎన్నోరకాల టూత్ పేస్ట్ లు అందుబాటులో ఉన్నాయి. అయితే కొంతమంది బ్రష్ నిండా టూత్ పేస్ట్ ను పెట్టుకుని పళ్లు తోముతుంటారు. కానీ దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసా? 

నోటి సంరక్షణ, పరిశుభ్రత.. ఒక్క నోటిని మాత్రమే  కాదు మన మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకే రోజుకు రెండు సార్లు అంటే ఉదయం, రాత్రిపూట ఖచ్చితంగా పళ్లను తోముకోవాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెప్తుంటారు. రోజుకు రెండు సార్లు బ్రష్ చేయడం వల్ల పళ్లు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. 
 

అలాగే రాత్రిపూట నోట్లో పెరిగే బ్యాక్టీరియా కూడా బయటకు పోతుంది. అయితే కొంతమంది కొద్దిమొత్తంతోనే పళ్లు తోమితే.. మరి కొంతమంది మాత్రం టూత్ పేస్ట్ ను మరీ ఎక్కువగా పెట్టుకుని పళ్లను తోముతుంటారు. ఎక్కువ టూత్ పేస్ట్ ను పెడితే పళ్లు బాగా క్లీన్ అవుతాయని అనుకుంటారు. కానీ ఇలా మోతాదుకు మించి టూత్ పేస్ట్ ను పెట్టుకుని పళ్లు తోమితే ప్రయోజనాల కన్న నష్టాలే ఎక్కువగా జరుగుతాయి తెలుసా? 

ఎంత టూత్ పేస్ట్ తో పళ్లు తోమాలి? 

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. మరీ ఎక్కువ టూత్ పేస్ట్ తో పళ్లను తోమకూడదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బఠానీ గింజ సైజు టూత్ పేస్ట్ తో పళ్లను తోమితే సరిపోతుంది. ఈ మొత్తం పేస్ట్ తో పళ్లు క్లీన్ అవుతాయి.

ఇకపోతే పిల్లలు బ్రష్ చేసేటప్పుడు కూడా మరింత జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకు చాలా తక్కువ మొత్తంలో టూత్ పేస్ట్ ను పెట్టాలి. అది ఏదైనా సరే అతిగా ఇవ్వడం ఆరోగ్యానికి హానికరం. ఇది టూత్ పేస్ట్ కు కూడా వర్తిస్తుంది. టూత్ పేస్ట్ ను ఎక్కువగా వాడితే పళ్లు, చిగుళ్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. 


ಜಾಗರೂಕರಾಗಿರಿಮೊಡವೆಗಳಿಗೆ ಟೂತ್ಪೇಸ್ಟ್ ಬಳಸುವುದು ಯಾವಾಗಲೂ ನಿಮ್ಮ ಕೊನೆಯ ಉಪಾಯವಾಗಿರಬೇಕು! ಅನಗತ್ಯವಾಗಿ ಮೊಡವೆ ಮೇಲೆ ಪೇಸ್ಟ್ ಹಚ್ಚುವುದರಿಂದ ಚರ್ಮವನ್ನು ಹೆಚ್ಚು ಕೆರಳಿಸಬಹುದು ಮತ್ತು ಮೊಡವೆಗಳನ್ನು ಇನ್ನಷ್ಟು ಹದಗೆಡಿಸುತ್ತದೆ! ಇದರಿಂದ ಮೊಡವೆ ಹೆಚ್ಚಾಗುವ ಸಾಧ್ಯತೆ ಕೂಡ ಇದೆ.

ఎక్కువ టూత్ పేస్ట్ ఎందుకు మంచిది కాదు? 

టూత్ పేస్ట్ ను మరీ ఎక్కువగా వాడితే దంతాలు దెబ్బతింటాయి. పళ్లను బలంగా చేయడానికి ఉపయోగించే టూత్ పేస్ట్ లో ఉండే సోడియం ఫ్లోరైడ్ నోటి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. దీనివల్ల  పళ్లలో గుంతలు ఏర్పడతాయి. అలాగే పిల్లల్లో ఫ్లోరోసిస్ వంటి సమస్యలు కూడా వస్తాయి. అందుకే పళ్లను తోమడానికి తక్కువ టూత్ పేస్ట్ ను ఉపయోగించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

మౌత్ వాష్ ఎప్పుడు ఉపయోగించాలి?

చాలా మంది మౌత్ వాష్ ను కూడా ఉపయోగిస్తుంటారు. అయితే మీకు ఏవైనా నోటి సంబంధించిన సమస్యలు ఉంటే మాత్రం డాక్టర్ ను సంప్రదించిన తర్వాతే వాడాలి. మీ నోరు ఆరోగ్యంగా ఉంటే మీరు బ్రష్ చేసిన తర్వాత మౌత్ వాష్ ను ఉపయోగించొచ్చు. ఇది నోటిని తాజాగా ఉంచుతుంది. అలాగే నోట్లో దుర్వాసన రాకుండా చేస్తుంది. అలాగే మౌత్ వాష్ నోట్లో ఉన్న హానికరమైన బ్యాక్టీరియాను కూడా తొలగించడానికి సహాయపడుతుంది. అయితే ఏ మౌత్ వాష్ మంచిదో దాన్నే వాడాలి. 

Latest Videos

click me!