ఉదయం వాకింగ్ కు వెళితే ఏమౌతుందో తెలుసా?

First Published | Nov 6, 2024, 3:59 PM IST

వాకింగ్ మన శరీరాన్ని ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఉదయం కొంత సేపు నడిస్తే మీరు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారో తెలుసా?

ఉదయపు వాకింగ్ ప్రయోజనాలు

చాలా మంది ఉదయం నిద్రలేచిన వెంటనే వాకింగ్ కు వెళుతుంటారు. కానీ కొంతమంది మాత్రం అస్సలు వాకింగ్ కే వెళ్లరు. నిజానికి ఇది మనల్ని హెల్తీగా, జబ్బులకు దూరంగా ఉంచే చాలా సులువైన వ్యాయామం. ప్రతిరోజూ వాకింగ్ కు వెళ్లడం వల్ల మనం ఎన్నో ప్రయోజనాలను పొందుతాం. 

ఉదయం నడక ప్రయోజనాలు

వేరే ఎక్సర్ సైజుల లాగా వాకింగ్ కు మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. కానీ వాకింగ్ మన మొత్తం శరీరాన్ని చురుగ్గా ఉంచుతుంది. రోజూ వాకింగ్ చేయడం వల్ల శరీరంలోని అదనపు కేలరీలు బర్న్ అవుతాయి. అసలు ఉదయపు నడక వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 


ఉదయం నడక ప్రయోజనాలు

ఉదయం నడక వల్ల కలిగే ప్రయోజనాలు:

శక్తి స్థాయిలను పెంచుతుంది

మార్నింగ్ వాకింగ్ మనల్ని అలసిపోకుండా చేసే ఒక శక్తివంతమైన వ్యాయామం. ప్రతిరోజూ ఉదయాన్నే వాకింగ్ చేయడం వల్ల మన శరీర శక్తి స్థాయిలు పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే నిరంతర వాకింగ్ సాధారణం కంటే ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది.

ఇది మన మొత్తం శారీరక ఆరోగ్య శక్తి స్థాయిలను కూడా పెంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం మీరు మీ ఇంటి దగ్గర నుంచి పార్కుకు లేదా ఇంటి లోపలే కనీసం ఒక 30 నిమిషాల పాటు నడవడం అలవాటు చేసుకోండి. మెట్లపై 10 నిమిషాలు నడిస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 

ఉదయం నడక ప్రయోజనాలు

వ్యాధులు రాకుండా నిరోధిస్తుంది

మీరు ఉదయాన్నే నడవడం వల్ల మీ వ్యాయామ అవసరాలను తీర్చుకున్న వారవుతారు. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. మీరు గనుక ప్రతిరోజూ ఉదయాన్నే కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే మీకు ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే ఒక  రోజుకి కనీసం 150 నుంచి 300 నిమిషాలు నడిస్తే మొత్తం ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది.  

బరువు తగ్గడానికి సహాయపడుతుంది

మార్నింగ్ వాకింగ్ బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు గనుక ప్రతిరోజూ ఉదయాన్నే ఒక 30 నిమిషాల పాటు నడిస్తే మీ శరీరంలో దాదాపు 400 కేలరీలు తగ్గుతాయి. అయితే ఇది మీరు నడిచే వేగం, మీ ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది.

ఉదయం నడక ప్రయోజనాలు

శారీరక సమస్యలను నివారిస్తుంది

ఉదయపు నడక వల్ల మీరు ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా తగ్గించుకోగలుగుతారు. ఉదయాన్నే నడవడం వల్ల మీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అలాగే రోగాలను తట్టుకునే సామర్థ్యం కూడా పెరుగుతుంది.

ఇది మీకు వివిధ అంటువ్యాధులు సోకే ప్రమాదాన్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది. ముఖ్యంగా ఉదయపు నడక హక మంచి హెల్తీ వ్యాయామం. కాబట్టి డయాబెటిస్ నుంచి గుండె జబ్బుల వరకు ఎన్నో రోగాల ప్రమాదాల్ని తగ్గించడానికి కూడా బాగా సహాయపడుతుంది.

దీని కోసం మీరు క్రమం తప్పకుండా 30 నిమిషాల పాటు ఖచ్చితంగా నడవాలి. మార్నింగ్ వాక్ మీ శ్వాసకోశ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అలాగే ఇది క్యాన్సర్ ప్రమాదం నుంచి కూడా రక్షిస్తుంది. 

మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

మార్నింగ్ వాకింగ్ మీ శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాదు మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి కూడా సహాయపడుతుంది. ఎందుకంటే వాకింగ్ మన మొత్తం శరీర భాగాలను కదిలిస్తుంది. ఇది శరీరానికి అవసరమైన శక్తి స్థాయిలను పెంచుతుంది. అలాగే హార్మోన్ల హెచ్చు తగ్గులను నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది. దీనివల్ల మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది.

అలాగే మార్నింగ్ వాక్ ఒత్తిడిని, ఆందోళనను, అలసటను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం మీరు ప్రతిరోజూ కనీసం 20 నిమిషాలైనా నడవాలి. 

Latest Videos

click me!