వారం రోజులు రోజూ 2 యాలకులు తింటే ఏమౌతుందో తెలుసా?

First Published | Nov 8, 2024, 10:30 AM IST

యాలకులు మసాలా దినుసులు అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ యాలకులు వంటలను రుచికరంగా చేయడమే కాకుండా.. మన ఆరోగ్యానికి కూడా ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. మీరు ఒక వారం పాటు రోజుకు రెండు యాలకులు తింటే ఏమౌతుందో తెలుసా? 

యాలకులు ఒక మసాలా దినుసే అయినా.. ఇది మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. దీన్ని రకరకాల  ఆహారాల్లో, టీ లో ఉపయోగిస్తారు. దీని నుంచి వచ్చే వాసన ఎంత బాగుంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ఇండియాలో ప్రతి వంటింట్లో యాలకులు ఖచ్చితంగా ఉంటాయి. మన ఇండియన్ ఫుడ్ లో యాలకులకు ప్రత్యేక స్థానం ఉంది. 

యాలకులు సైజులో చిన్నగా ఉన్నా.. దీనిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. జింక్, విటమిన్ సి, ఐరన్, రిబోఫ్లేవిన్, సల్ఫర్, నియాసిన్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి.

వీటిని తినడం వల్ల మనం ఎన్నో జబ్బులకు దూరంగా ఉంటాం. అలాగే జబ్బులు తొందరగా తగ్గిపోతాయి. ముఖ్యంగా మీరు రోజుకు రెండు యాలకులు తింటే మాత్రం వీటివల్ల మీరు ఎన్నో బెనిఫిట్స్ ను పొందుతారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

యాలకులు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

నోటి దుర్వాసన దూరం

మీకు తెలుసా? యాలకులు నోటి దుర్వాసనను పోగొట్టడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఈ మసాలా దినుసు ఒక అద్భుతమైన మౌత్ ఫ్రెష్నర్. వీటిని తింటే నోట్లో నుంచి దుర్వాసన రావడం తగ్గుతుంది. నిపుణఉల ప్రకారం.. మలబద్దకం, కడుపు నొప్పి వల్ల కూడా నోట్లో నుంచి దుర్వాసన వస్తుంది. ఇలాంటి వారు యాలకులను తింటే వీటిలోని పదార్థాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.

అలాగే నోట్లో నుంచి దుర్వాసన రాకుండా చేస్తాయి. నోట్లో నుంచి దుర్వాసన ఎక్కువగా వచ్చే వారు రోజుకు రెండు యాలకులను తినాలని నిపుణులు చెబుతున్నారు. యాలకుల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు నోటి దుర్వాసనను కలిగించే జబ్బులతో మీ శరీరం పోరాడటానికి సహాయపడుతుంది. యాలకులు నోటి నుంచి తాజా వాసన వచ్చేలా చేస్తాయి. 
 


గొంతు నొప్పి తగ్గుతుంది

యాలకులు గొంతు నొప్పిని తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది. ఆడవాళ్లు జలుబు, గొంతు నొప్పి తగ్గడానికి ఏవేవో చిట్కాలను పాటిస్తుంటారు. అయినా అస్సలు తగ్గవు. కానీ యాలకులు ఈ సమస్యలను తగ్గించంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. దగ్గు, జలుబు తగ్గడానికి రాత్రి తిన్న తర్వాత ఒక రెండు యాలకులను నమిలితే సరిపోతుంది. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లను తాగాలి. ఇది గొంతునొప్పిని వెంటనే తగ్గిస్తుంది. 

జీర్ణవ్యవస్థను బలంగా చేస్తాయి

మగవారి కంటే ఆడవారే తిన్న తర్వాత యాలకులను నోట్లో వేసుకుని నములుతుంటారు. మీకు తెలుసా? ఈ అలవాటు ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే దీనిలో ఉండే పదార్థాలు తిన్నది జీర్ణం కావడానికి సహాయపడతాయి. ఈ మసాలా దినుసు మన జీర్ణవ్యవస్థను బలంగా చేస్తుంది.
 


మీ జీర్ణవ్యవస్థలో ఎలాంటి సమస్య ఉన్నా తగ్గిపోతుంది. ముఖ్యంగా గ్యాస్ సమస్య వెంటనే తగ్గిపోతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే గుండెల్లో మంట కూడా తగ్గిపోతుంది. జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలుంటే మీరు రోజూ 2 యాలకులను తినండి. 

యాలకులు శరీరాన్ని నిర్విషీకరణ చేస్తాయి

యాలకుల్లో రసాయన లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి మన శరీరానికి హాని చేసే విషపదార్థాలను, ఫ్రీ రాడికల్స్ ను తొలగించడానికి సహాయపడతాయి. యాలకులు మన రక్తాన్ని కూడా శుద్ధి చేస్తాయి. అలాగే యాలకులు ఎర్ర రక్తకణాలు ఏర్పడటానికి కూడా సహాయపడతాయి. ఇవి మన శరీరాన్ని నిర్విషీకరణ చేస్తాయి. 
 

అధిక రక్తపోటును నియంత్రిస్తాయి

హై బీపీ పేషెంట్లకు యాలకులు చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇవి వీళ్లకు దివ్య ఔషదంలా పనిచేస్తాయి. యాలకులు తీయగా, రుచిగా ఉండటమే కాకుండా.. దీనిలో ఉండే గుణాలు బీపీని కంట్రోల్ చేయడానికి కూడా సహాయపడతాయి. ఈ మసాలా దినుసుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు శరీరాన్ని ఫిట్ గా ఉంచుతాయి. అలాగే దీనిలో ఉండే సిస్టోలిక్, డయాస్టొలిక్ బీపీని కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి. 

యాలకులు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి

అవును యాలకులు శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి కూడా సహాయపడతాయి. మీరు గనుక రోజూ 2 యాలకులు నమిలితే గుండెకు సంబంధించిన వ్యాధుల నుంచి బయటపడతారు.

అలాగే ఇది మన శరీరంలో రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. కొరోనరీ ధమనుల నుంచి కొలెస్ట్రాల్ ను తొలగించడానికి సహాయపడుతుంది.

Latest Videos

click me!