Sugar: మనం రోజూ తీసుకునే టీ, కాఫీ, స్వీట్లు, బిస్కెట్లు, కూల్ డ్రింక్స్‌లో చక్కెర ఉంటుంది. దానికి తోడు అన్నం, చపాతీ వంటి పిండి పదార్థాలు జీర్ణమై తయారయ్యే గ్లూకోజ్ రూపంలో చక్కెర మన రక్తంలోకి చేరుతుంది. ఇది శక్తినిచ్చినా, పరిమితి మించితే ప్రమాదం.
Sugar: శరీరంలో చక్కెర మోతాదు పెరిగితే పేగుల్లో జరిగేది ఇదే!
మనం రోజూ తీసుకునే టీ, కాఫీ, స్వీట్లు, బిస్కెట్లు, కూల్ డ్రింక్స్‌లో చక్కెర ఉంటుంది. దానికి తోడు తినే అన్నం, చపాతీ వంటి పిండి పదార్థాలు జీర్ణమై తయారయ్యే గ్లూకోజ్ రూపంలో చక్కెర మన రక్తంలోకి చేరుతుంది. ఇది శక్తినిచ్చినా, పరిమితి మించితే ప్రమాదం. కానీ కొంతమంది మాత్రం అదే పనిగా టీ, కాఫీలు తాగడం, ఎక్కువ మొత్తంలో అన్నం, చపాతీలు, స్వీట్లు తినేస్తుంటారు. అది దీర్ఘకాలిక సమస్యలకు దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు.
27
శరీరంలో చక్కెర పెరిగితే పేగుల్లో బ్యాక్టీరియా పెరుగుతుంది
అతిగా చక్కెర తింటే బరువు పెరగడమే కాదు, పేగుల్లోని మంచి బ్యాక్టీరియా నశించి చెడు బ్యాక్టీరియా పెరుగుతుంది. దీనివల్ల జీర్ణవ్యవస్థలో వాపు (Inflammation) ఏర్పడి గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. పొట్ట ఆరోగ్యం దెబ్బతింటే రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
37
ఈ బ్యాక్టీరియా శరీరానికి చాలా మంచిది
మన పేగుల్లో ఉండే కోట్లాది బ్యాక్టీరియాల సమూహాన్నే 'గట్ మైక్రోబయోమ్' అంటారు. ఇందులో మంచి బ్యాక్టీరియా ఆహారాన్ని అరిగించడానికి, విటమిన్ల తయారీకి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. అయితే, మనం అతిగా చక్కెర లేదా జంక్ ఫుడ్ తిన్నప్పుడు చెడు బ్యాక్టీరియా పెరిగిపోయి గ్యాస్, వాపు (Inflammation), ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందుకే మన ఆరోగ్యం కోసం శరీరంలో చక్కెర శాతాన్ని తగ్గించుకోవడం చాలా మంచిది.
శరీరంలో ఏ బ్యాక్టీరియా పెరగాలో మనం తినే ఆహారమే నిర్ణయిస్తుంది. ఎక్కువ చక్కెర తినడం వల్ల గట్ మైక్రోబయోమ్ సమతుల్యత దెబ్బతింటుంది. ఇది గ్యాస్, కడుపు ఉబ్బరం, తిండిపై కోరికలకు దారితీస్తుంది. అధిక చక్కెర పేగు పొరల్లో వాపునకు కూడా కారణమవుతుంది.
పేగుల్లోని హానికరమైన బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థలోని సమతుల్యతను దెబ్బతీస్తుంది. దీనివల్ల అసౌకర్యంగా, కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. కొందరిలో చక్కెర పదార్థాలపై తీవ్రమైన కోరికలు కూడా కలుగుతాయి.
67
అధిక చక్కెర ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కు దారితీస్తుంది.
చక్కెర కలిపిన ఆహారాలకు బదులుగా, ఫైబర్ ఉన్న పండ్లను తినండి. పండ్లలో సహజంగానే చక్కెర ఉంటుంది. కానీ ఫైబర్ జీర్ణక్రియను నెమ్మదింపజేస్తుంది. చక్కెర ఎక్కువగా తినేలా చేస్తుంది. కాలక్రమేణా, అధిక చక్కెర ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కు దారితీస్తుంది. దీంతో శరీరం రక్తంలో చక్కెరను నియంత్రించడం కష్టమవుతుంది.
77
అదనపు చక్కెర దీర్ఘకాలిక వాపు, రక్తపోటు, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను పెంచుతుంది.
అదనపు చక్కెర దీర్ఘకాలిక వాపు, రక్తపోటు, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను పెంచుతుంది. ఇది గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్నిపెంచుతుంది. ఇది కాలేయంలో అదనపు కొవ్వు చేరడానికి కారణమై, నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధికి దారితీస్తుంది. చక్కెర నోటిలోని హానికర బ్యాక్టీరియాను పెంచి, దంతాల ఎనామిల్‌ను దెబ్బతీసే యాసిడ్లను ఉత్పత్తి చేస్తుంది. ఇది చిగుళ్ల వ్యాధులకు కారణమవుతుంది.