మన శరీరానికి ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ అన్నీ సరైన మోతాదులో అవసరం. కానీ అన్నంలో ఇవి చాలా తక్కువ. కాబట్టి కేవలం అన్నమే తింటే శరీరానికి కావాల్సిన ఐరన్, కాల్షియం, విటమిన్ B12, విటమిన్ D వంటి ముఖ్య పోషకాలు అందవు. దీని వల్ల బలహీనత, అలసట, రక్తహీనత, కీళ్ల నొప్పులు, జీర్ణ సమస్యలు వస్తాయి. ప్రతిరోజూ వైట్ రైస్ తినడం వల్ల మెటబాలిక్ సిండ్రోమ్ ప్రమాదం పెరుగుతుంది.
అన్నం పూర్తిగా మానేయాలా?
అన్నం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. అన్నం మన ఆహారంలో ఉండాలి కానీ సరైన మోతాదులో తీసుకోవడం ముఖ్యం. ఉదయం లేదా మధ్యాహ్నం ఒకపూట అన్నం తిని.. మరో రెండు పూటలు ఏదైనా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మంచిది. అలాగే అన్నం తినేప్పుడు పప్పు, కూర, పెరుగు, సలాడ్ వంటివి తప్పకుండా ఉండాలి. రోజూ 30–45 నిమిషాల వ్యాయామం, తగినంత నీరు, మంచి నిద్ర ఉంటే ఆరోగ్యంగా ఉండొచ్చు.