ఆ ఆర్డర్‌ను ఛాలెంజ్ చేస్తూ ఇన్సూరెన్స్ కంపెనీ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టు పాత ఆర్డర్‌ను కొట్టివేసి కొత్త తీర్పు చెప్పింది. చనిపోయిన వ్యక్తి మరణానికి తాగుడే కారణం కావడంతో బీమా కంపెనీ డబ్బులు చెల్లించలేమని చెప్పడం సబబేనని వ్యాఖ్యలు చేసింది. దీనివల్ల అర్థం అయ్యేదేంటంటే.. బీమా చేస్తున్నప్పుడు మనకున్న రోగాల గురించి ముందే తెలియజేయాలి. బీమా భారం కాస్త ఎక్కువైతే కావొచ్చుగానీ, అనుకొని పరిస్థితుల్లో తేలికగా బీమా పొందే అవకాశం ఉంటుంది.