Health: మ‌నిషికి రోజుకు ఎంత ప్రోటీన్ కావాలో తెలుసా.? ఎక్కువైనా క‌ష్ట‌మే..

Published : Oct 17, 2025, 04:59 PM IST

Health: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ 2020 మార్గదర్శకాల్లో ప్రతి వ్యక్తి తన బరువు ఆధారంగా ఎంత ప్రోటీన్ తీసుకోవాలో స్పష్టంగా తెలిపింది. 

PREV
15
రోజుకు ఎంత ప్రోటీన్ అవ‌స‌రం.?

ICMR–NIN ప్రకారం, ఒక యువకుడు తన బరువు ప్రతి కిలోకు 0.83 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి. ఉదాహరణకు ఒక వ్య‌క్తి బ‌రువు 80 కిలోలు ఉంటే అత‌డికి సుమారు 66 గ్రాముల ప్రోటీన్ అవసరప‌డుతుంది. నిత్య వ్యాయామం చేసే వారు లేదా జిమ్‌కు వెళ్లే వారు తమ శారీరక శ్రమపై ఆధారపడి 1.2 నుంచి 2 గ్రాములు ప్రతి కిలో బరువుకి తీసుకోవాలి. అంటే 80 కిలోల బరువు ఉన్న వ్యక్తికి రోజుకు 96 గ్రాముల నుంచి 160 గ్రాముల ప్రోటీన్ అవసరం.

25
ICMR ప్రకారం వర్గాల వారీగా ప్రోటీన్ లెక్క

* యువ పురుషులు: మిడిల్ లెవెల్ పనులు చేసే పురుషులకు రోజుకు 54 గ్రాముల ప్రోటీన్ అవసరం.

* యువ మహిళలు: సాధారణ కార్యకలాపాలు చేసే మహిళలకు రోజుకు 45.7 గ్రాముల ప్రోటీన్ అవసరం.

గర్భిణీలు:

* 4వ నుంచి 6వ నెలలో రోజుకు అదనంగా 9.5 గ్రాములు, 7వ నుంచి 9వ నెలలో రోజుకు అదనంగా 22 గ్రాములు తీసుకోవాలి.

పాలిచ్చే మహిళలు:

డెలివరీ తర్వాత తొలి 6 నెలల్లో అదనంగా 16.9 గ్రాములు, ఆ తర్వాతి 6 నుంచి 12 నెలల్లో 13.2 గ్రాములు అదనంగా అవసరం.

35
తక్కువ లేదా ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే ఏమవుతుంది?

తక్కువ ప్రోటీన్ తీసుకుంటే బలహీనత, అలసట, ఇమ్యూనిటీ తగ్గిపోవడం వంటి సమస్యలు వస్తాయి. అధిక ప్రోటీన్ తీసుకోవడం వల్ల కిడ్నీపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అందుకే సరైన పరిమాణంలో, సమతుల్య ఆహారంతో ప్రోటీన్ తీసుకోవాలి.

45
నిపుణుల సూచనలు

హెల్త్ ఎక్స్‌పర్ట్స్ ప్రకారం, ప్రతి భోజనంలో 15–25 గ్రాముల ప్రోటీన్ ఉండాలి. ఇలా తీసుకుంటే రోజువారీ అవసరం తీరుతుంది. 30–35 ఏళ్ల వయసు తర్వాత శరీరంలో కండరాల నష్టం (సార్కోపెనియా) ప్రారంభమవుతుంది. ఆ వయసులో కొంచెం ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది.

55
ముఖ్యంగా గుర్తుంచుకోవాలి

ప్రోటీన్ అంటే కేవలం జిమ్ చేసే వాళ్లకే కాదు – ప్రతి ఒక్కరికీ అవసరమైన పోషక పదార్థం. తమ బరువు, వయస్సు, శారీరక శ్రమ ఆధారంగా సరైన లెక్కలో ప్రోటీన్ తీసుకుంటే ఆరోగ్యకరమైన జీవనం సాగించ‌వ‌చ్చు.

గ‌మ‌నిక‌: పైన తెలిపిన విష‌యాలు కేవ‌లం ప్రాథ‌మిక స‌మాచారం మేర‌కు మాత్ర‌మే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచ‌న‌లు పాటించ‌డ‌మే ఉత్త‌మం.

Read more Photos on
click me!

Recommended Stories