Health: LED లైట్ల వ‌ల్ల చ‌ర్మంపై నిజంగానే ప్రభావం ప‌డుతుందా.? ఇందులో నిజ‌మెంతంటే

Published : Jan 25, 2026, 12:00 PM IST

Health: ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా ఎల్ఈడీ లైట్లు క‌నిపిస్తున్నాయి. ఎక్కువ వెలుతురు ఇస్తుండ‌డంతో బైక్‌లు, కార్లతో పాటు ఇళ్ల‌లో కూడా వీటి వినియోగ‌మే ఎక్కువ‌గా ఉంటుంది. అయితే ఎల్ఈడీ లైట్ల వ‌ల్ల చ‌ర్మంపై దుష్ప్ర‌భావం ప‌డుతుంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. 

PREV
15
LED లైట్లు భద్రమేనా? చర్మానికి నిజంగా ప్రమాదమా?

ఈ రోజుల్లో ఇళ్లలో, కార్యాలయాల్లో ఎక్కువగా వాడుతున్న లైట్లు LED బల్బులే. తక్కువ విద్యుత్ వినియోగం, ఎక్కువకాలం పనిచేయడం వల్ల ఇవి ప్రజల్లో విస్తృతంగా ప్రాచుర్యం పొందాయి. అయితే తాజాగా LED లైట్ల వల్ల చర్మానికి హాని జరుగుతుందనే ప్రచారం వినిపిస్తోంది. నిజంగా ఇందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.

25
యూవీ రేడియేషన్ అంటే ఏమిటి?

సూర్యకాంతిలో ఉండే అల్ట్రా వయలెట్ కిరణాలనే యూవీ రేడియేషన్ అంటారు. ఇవి మూడు రకాలుగా ఉంటాయి.

UVA: చర్మం త్వరగా ముడతలు పడటానికి కారణమవుతుంది

UVB: సన్‌బర్న్, తీవ్రమైన స్కిన్ డ్యామేజ్‌కు దారి తీస్తుంది

UVC: అత్యంత ప్రమాదకరమైన కిరణాలు, అయితే భూమి వాతావరణంలోనే ఎక్కువగా శోషిస్తాయి.

యూవీ కిరణాల ప్రభావం ఎక్కువగా ఉంటే చర్మం వృద్ధాప్యంలోకి త్వరగా వెళ్లే అవకాశం ఉంటుంది.

35
LED బల్బులు యూవీ కిరణాలు విడుదల చేస్తాయా?

సాధారణంగా ఇళ్లలో వాడే LED బల్బులు యూవీ కిరణాలను విడుదల చేయవు. లేకపోతే అతి తక్కువ స్థాయిలో మాత్రమే విడుదల చేస్తాయి. మొత్తం వెలుతురులో 1 శాతం కంటే తక్కువ యూవీ ఉండే అవకాశం మాత్రమే ఉంటుంది. LED బల్బుల తయారీ విధానం కారణంగా యూవీ కిరణాలు బయటకు రాకుండా అవే అడ్డుకుంటాయి.

45
ఇంట్లో వాడే LED లైట్లతో ప్రమాదమా?

ఇంట్లో ఉపయోగించే సాధారణ తెల్ల LED బల్బులు చర్మానికి గానీ, కళ్లకు గానీ హాని కలిగించవు. వీటిలోని యూవీ స్థాయి సూర్యకాంతితో పోలిస్తే చాలా చాలా తక్కువ. రోజూ గంటల తరబడి LED లైట్ కింద ఉన్నా కూడా చర్మానికి ఎలాంటి ముప్పు ఉండదని నిపుణులు చెబుతున్నారు.

55
యూవీ LED లైట్లు వేరే అవసరాల కోసం

స్టెరిలైజేషన్, నెయిల్ క్యూరింగ్, ఇండస్ట్రియల్ అవసరాల కోసం ప్రత్యేకంగా తయారుచేసే యూవీ LED లైట్లు ఉంటాయి. ఇవి సాధారణ గృహ వినియోగానికి కావు. అలాంటి లైట్లను ఇంట్లో వాడకపోతే ఎలాంటి ప్రమాదం లేదు. సాధారణ LED బల్బుల విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. మొత్తం మీద సాధారణ గృహ వినియోగ LED లైట్ల వల్ల చర్మానికి హాని జరిగే అవకాశాలు లేవని నిపుణులు చెబుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories