Walking: నడక ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలుసు. నడకతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడడం, బరువు తగ్గడం, మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. అయితే.. ప్రతి రోజూ 7వేల అడుగులు నడిస్తే ఎన్నో ప్రయోజనాలో తెలుసా?
నడక వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఇది శరీరానికి మేలు చేసే సాధారణ కార్డియో వ్యాయామం. ఇటీవల జరిగిన ఓ అధ్యయనం ప్రకారం, రోజుకు కనీసం 7,000 అడుగులు నడవడం ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట. ఆ అధ్యయనం ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం.
24
రోజుకు 7,000 అడుగులు
10,000 అడుగులు నడవడం ఆరోగ్యానికి మంచిదని భావించబడుతున్నప్పటికీ, ఇటీవల జరిగిన అధ్యయనం ప్రకారం రోజుకు 7,000 అడుగులు నడవడం కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధులలో ఇది డిమెన్షియా ప్రమాదాన్ని 38 శాతం తగ్గించగలదని, డిప్రెషన్‌ను 22 శాతం వరకు తగ్గించగలదని వెల్లడైంది. అంతేకాదు.. దీర్ఘకాలిక వ్యాధి అయిన టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని 14 శాతం వరకు తగ్గించగలదని పరిశోధనలో తేలింది.
34
7000 అడుగుల ప్రయోజనాలు
జ్ఞాపకశక్తి కోల్పోవడం, మానసిక ఒత్తిడి, డయాబెటిస్, గుండె జబ్బులు వంటి అనేక ఆరోగ్య సమస్యలతో పాటు క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని కూడా రోజుకు 7,000 అడుగులు నడవడం తగ్గిస్తుందని పరిశోధకులు తెలిపారు. పదివేల అడుగులు నడిస్తేనే ఆరోగ్య ప్రయోజనం ఉంటుందని భావించడం అపోహ మాత్రమే. నిజానికి, మీరు నడిచే ప్రతి అడుగు శరీరంలో కొన్ని మార్పులను తీసుకురావడంలో సహాయపడుతుంది. మితమైన నడక శరీరానికి శక్తిని, మెదడుకు ప్రశాంతతను అందించి, దీర్ఘకాలిక ఆరోగ్యానికి దోహదం చేస్తుంది.
మీరు ప్రతిరోజూ 2,000 నుండి 3,000 అడుగులు మాత్రమే నడుస్తుంటే, అదనంగా మరో 1,000 అడుగులు నడవడం మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. నడకను సమర్థవంతంగా చేసుకోవాలంటే, మొదటి 10 నుంచి 15 నిమిషాలు నెమ్మదిగా నడవాలి. ఆ తర్వాత వేగాన్ని పెంచాలి. నెమ్మదిగా – వేగంగా మారుతూ నడవడం వల్ల ఇది మంచి కార్డియో వ్యాయామంగా మారుతుంది. ఈ విధంగా నడకను అలవాటు చేసుకుంటే బరువు తగ్గడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది.