వేడి పాల వల్ల బోలెడు ప్రయోజనాలున్నాయి. రాత్రిపూట వేడి పాలు తాగడం చాలా మంచిది. ఎందుకో తెలుసా
జీర్ణక్రియకు ఉత్తమం: పాలను వేడి చేసినప్పుడు, అందులోని ప్రోటీన్లు, కొవ్వులు విచ్ఛిన్నమై సులభంగా జీర్ణమవుతాయి. లాక్టోస్ అలర్జీ లేదా జీర్ణ సమస్యలు ఉన్నవారికి వేడి పాలు తాగడం మంచిది.
మంచి నిద్రకు సహాయపడుతుంది: వేడి పాలలో 'ట్రిప్టోఫాన్' (Tryptophan) అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది మెదడుకు విశ్రాంతినిచ్చి, నిద్రను ప్రేరేపిస్తుంది. రాత్రి పడుకునే ముందు గ్లాసు గోరువెచ్చని పాలు తాగితే, రోజంతా ఉన్న అలసట తీరిపోయి ప్రశాంతంగా నిద్రపడుతుంది.
తక్షణ శక్తినిస్తుంది: పాలలో కొద్దిగా బాదం లేదా తేనె కలిపి వేడిగా తాగితే, శరీరానికి వెంటనే శక్తి వస్తుంది. జలుబు, దగ్గు ఉంటే, వేడి పాలలో పసుపు కలిపి తాగడం చాలా మంచిది.
ఇది ముఖ్యం: మరీ వేడి పాలు తాగడం వల్ల నోరు, గొంతులో పుండ్లు ఏర్పడవచ్చు. ఇది దంతాల ఎనామిల్‌ను కూడా దెబ్బతీస్తుంది. ఎప్పుడూ గోరువెచ్చని పాలు తాగడమే సురక్షితం.