Ice Apple: తాటి ముంజల్లో ఇన్ని పోషకాలా? తెలిస్తే బుట్టలు బుట్టలు కొంటారు

Published : May 23, 2026, 04:19 PM IST

Ice Apple: ఎండలు మండిపోతున్నాయా? ఈ వేసవిలో కాస్త రిలీఫ్ కావాలంటే తాటి ముంజలు తినాల్సిందే. ఒక్కసారి గొంతులో పడితే చల్లదనంతో శరీరం మొత్తం కూలెక్కిపోద్ది. లేత కొబ్బరి నీళ్లను తలపించే ఈ ముంజలు వేసవి తాపాన్ని తీరుస్తాయి. ఇంకా ఎన్ని లాభాలో తెలుసా?

PREV
15
తాటిముంజలతో శరీరం డీహైడ్రేషన్‍కు గురికాదు

తాటి ముంజల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వేసవిలో శరీరం డీహైడ్రేషన్‌ కాకుండా కాపాడుతాయి. ఎండల్లో ఎక్కువసేపు తిరిగిన తర్వాత వీటిని తింటే శరీరం వెంటనే రీఫ్రెష్‌ అయిన ఫీలింగ్‌ వస్తుంది. అలాగే శరీరంలో వేడిని తగ్గించి వడదెబ్బ నుంచి రక్షణ కల్పిస్తుంది.

25
ముదురు ముంజలు తినకూడదు

ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. విటమిన్‌ A, C, E, Kతో పాటు B-కాంప్లెక్స్‌ కూడా లభిస్తుంది. అంతేకాదు ఐరన్‌, కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్‌, జింక్‌ వంటి ఖనిజాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇవి లేతగా ఉన్నప్పుడే తినేయాలి. ముదిరిపోయినవి తింటే కడుపునొప్పి వచ్చే ప్రమాదం ఉంది. విరేచనాలు కూడా అవుతాయి.

35
మలబద్ధకం, ఎసిడిటీ వంటి సమస్యలకు చెక్

తాటి ముంజల్లో ఫైబర్‌ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం, ఎసిడిటీ వంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చు. వేసవిలో వచ్చే చర్మ సమస్యలు, అలర్జీలను తగ్గించడంలో కూడా ఇవి ఉపయోగపడతాయి. ముంజల గుజ్జును చర్మానికి రాసుకుంటే చర్మం మృదువుగా మారి పొడిబారడం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. 

45
కిడ్నీల పనితీరు మెరుగుపడతాయి

ఇక పొటాషియం సమృద్ధిగా ఉండటం వల్ల శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించడంలో ఇవి సహాయపడతాయి. రక్తపోటు నియంత్రణ, గుండె ఆరోగ్యం, కిడ్నీల పనితీరు మెరుగుపడటంలో కూడా ముంజలు ఉపయోగకరంగా ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. డయాబెటిస్‌ నియంత్రణకు కూడా ఇవి కొంతమేర సహాయపడతాయని చెబుతున్నారు. లేత తాటి ముంజల్లో నీళ్లు కూడా ఉంటాయి. కొబ్బరి నీళ్లలాగానే ఉంటాయి. వాటిని శరీరానికి ఎంత హాయిగా ఉంటుందో.

55
ఆరోగ్యానికీ మేలు చేసే సహజ వరం తాటి ముంజలు

అయితే తాటి ముంజలు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. అందుకే కొనుగోలు చేసిన వెంటనే తాజాగా తినడం మంచిది. ఫ్రిజ్‌లో ఉంచినా రెండు మూడు రోజుల్లోపే తీసుకోవాలి. వేసవిలో దాహం తీర్చడమే కాదు.. ఆరోగ్యానికీ మేలు చేసే సహజ వరం తాటి ముంజలు.

Read more Photos on
click me!

Recommended Stories