Hair: జుట్టు ఊడిపోవడం, రఫ్‌గా మారడం, ఫ్రిజీ హెయిర్ వంటి సమస్యలు చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి. ఈ సమస్యలను తగ్గించేందుకు చాలామంది సహజమైన పద్ధతులను వెతుకుతుంటారు. అలాంటి ఒక బెస్ట్ నేచురల్ రెమెడీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కలోంజీ గింజలను నల్ల జీలకర్ర అని కూడా పిలుస్తారు. వీటి నుంచి తయారు చేసే నూనె కలోంజీ నూనె అంటారు. భారతదేశం మాత్రమే కాదు, మిడిల్ ఈస్ట్ దేశాల్లో కూడా ఈ ఆయిల్‌ను బ్యూటీ కేర్‌కు ఉపయోగిస్తున్నారు. ఇందులో ఉండే పోషకాలు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. కలోజి నూనెలో జుట్టుకు అవసరమైన అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులో థైమోక్వినోన్ (Thymoquinone), ఫ్యాటీ యాసిడ్లు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు తల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. జుట్టు రూట్స్‌ను బలంగా చేయడంలో కూడా ఇవి ఉపయోగపడతాయి. అలాగే స్కాల్ప్‌లో వచ్చే ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించి జుట్టు పలచగా మారకుండా కాపాడడంలో సహాయపడుతాయి.
25
స్కాల్ప్ మసాజ్‌తో మంచి ఫలితం
కలోంజి నూనెను వాడే సరైన పద్ధతుల్లో స్కాల్ప్ మసాజ్ ఒకటి. ఇందుకోసం రెండు చెంచాల కలోంజి నూనె తీసుకోవాలి. అందులో బాదం నూనె లేదా కొబ్బరి నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని తల చర్మంపై మెల్లగా 10–15 నిమిషాలు మసాజ్ చేయాలి. తర్వాత రాత్రంతా అలాగే ఉంచి ఉదయం కడిగేయాలి. ఇలా చేయడం వల్ల తల చర్మంలో రక్త ప్రసరణ మెరుగవుతుంది. జుట్టు రూట్స్‌కు పోషకాలు చేరి జుట్టు క్రమంగా బలంగా మారుతుంది.
35
జుట్టు పెరుగుదలకు కలోంజి – ఉల్లిపాయ నూనె
జుట్టు పెరుగుదల కోసం కలోంజి నూనె, ఉల్లిపాయ నూనె మిక్స్ కూడా ఉపయోగపడుతుంది. ఇందుకోసం రెండు నూనెలను సమాన మోతాదులో కలపాలి. జుట్టు పలుచగా ఉన్న ప్రాంతాల్లో తల చర్మంపై రాయాలి. రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు మైల్డ్ షాంపూతో కడగాలి. వారం లో రెండు సార్లు ఇలా చేస్తే మంచి ఫలితం కనిపించవచ్చు. ఉల్లిపాయ నూనెలో ఉండే సల్ఫర్ జుట్టు రూట్స్‌ను బలంగా చేయడంలో సహాయపడుతుంది.
మీ జుట్టు డ్రైగా, డ్యామేజ్‌గా లేదా ఫ్రిజీగా ( జుట్టు తేమను కోల్పోవడం, పొడిగా మారడం) ఉంటే కలోంజి హెయిర్ మాస్క్ ఉపయోగపడుతుంది. ఈ హెయిర్ మాస్క్‌ను ఒక చెంచా కలొంజి నూనె,ఒక చెంచా తేనె లేదా పెరుగును కలిపి పేస్ట్‌లా తయారు చేసి జుట్టుకు రాయాలి. ఒక గంట తర్వాత మైల్డ్ షాంపూతో కడగాలి. ఇలా చేస్తే జుట్టుకు లోతుగా పోషణ అందుతుంది. జుట్టు మృదువుగా, మెరిసేలా మారుతుంది.
55
మరింత పోషణకు ఇలా చేయండి
జుట్టుకు మరింత పోషణ ఇవ్వాలంటే కలోంజి నూనెను కొంచెం గోరువెచ్చగా చేసి తల చర్మంతో పాటు జుట్టుకు రాయాలి. తర్వాత తలకు వెచ్చని తువాలు కట్టాలి. ఇలా కనీసం ఒక గంట లేదా రాత్రంతా ఉంచితే నూనె బాగా పట్టుకుంటుంది. దీంతో స్కాల్ప్‌కు పూర్తి పోషణ అందుతుంది. జుట్టు పెరుగుదలకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.
గమనిక: పైన తెలిపిన ఈ విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించినంత వరకు వైద్యుల సూచనలు పాటించడమే మంచిది.