Milk Benefits: కొందరికి ఎంత ట్రై చేసినా నైట్ నిద్రపట్టదు. అందుకని స్లీపింగ్ ట్యాబ్లెట్లు వేస్తారు. లేదా నిద్రపట్టడం లేదని ఫోన్‍తో గడిపేస్తారు. చక్కగా వేడి పాలు ట్రై చేయండి. మెదడులో సెరటోనిన్, మెలటోనిన్ హార్మోన్లు రిలీజ్ చేసి నిద్రపోయేలా చేస్తుంది.
జనరల్‍గా చాలా మందికి ఏ ఇంత నొప్పొచ్చినా, నిద్ర పట్టకపోయినా, నీరసంగా ఉన్నా ట్యాబ్లెట్లు వాడేయడం, ప్రోటీన్ షేకులు తాగేస్తారు. లేదంటే సోషల్ మీడియాలో వచ్చే రకరకాలు ట్రై చేస్తారు. కానీ ఇవేమీ లేని పాత రోజుల్లో ఏం చేసేవారో అసలు గుర్తుందా? చక్కగా ఇంట్లో అమ్మమ్మో, నాన్నమ్మో..వేడి వేడి పాలు కలిపి ఇచ్చేది. దాంట్లో కాసింత మిరియాల పొడి, పసుపు కలిపి ఇస్తే...పొద్దున్న కల్లా బోలెడంత ఎనర్జీ వచ్చేసేది. ఈ రోజు 'ప్రపంచ పాల దినోత్సవం' (World Milk Day). ఈ సందర్భంగా, మనం మరిచిపోతున్న అమ్మమ్మల కాలం నాటి పాల చిట్కాల వెనుక ఉన్న అసలు సైన్స్ ఏంటో ఇక్కడ చూద్దాం.
27
నిద్రకు దివ్యౌషధం పాలే
ఫోన్ చూస్తూ గడిపేసేవాళ్లకి రాత్రంతా నిద్రపట్టదు. అలాంటప్పుడు ట్యాబ్లెట్లకు బదులు వేడి పాలు తాగండి. పాలలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ మన మెదడులో సెరటోనిన్, మెలటోనిన్ అనే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఇవి మనసును ప్రశాంతంగా ఉంచి, పడుకునేందుకు శరీరానికి సిగ్నల్ ఇస్తుంది. అందుకే రాత్రి పడుకునే ముందు వేడి పాలు తాగడం కేవలం అలవాటు కాదు, అదొక సైంటిఫిక్ స్లీప్ థెరపీ. దానివల్ల ఫలితమే ఉంటుంది గానీ..సైడ్ ఎఫెక్ట్ ఉండదు.
37
పసుపు పాలు
మన దేశ 'నేచురల్ యాంటీబయాటిక్': జలుబు, కాస్త దగ్గు రాగానే అమ్మమ్మ పసుపు పాలు పట్టుకొచ్చేది గుర్తుందా? దీన్నే ఇప్పుడు ప్రపంచం 'టర్మరిక్ లాటే' అని ముద్దుగా పిలుస్తోంది! పసుపులో ఉండే కర్కుమిన్ (Curcumin) అనే పదార్థానికి యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలు ఎక్కువ. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచి చిన్న చిన్న ఇన్ఫెక్షన్లను తరిమికొడుతుంది.
గొంతులో గరగర లేదా దురదగా ఉన్నప్పుడు తేనె కలిపిన వేడి పాలు తాగడం చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. తేనె గొంతుకు ఒక రక్షణ పొరలా పనిచేస్తే, వేడి పాలు నొప్పిని తగ్గిస్తాయి. అయితే, ఏడాది లోపు పిల్లలకు తేనె ఇవ్వకూడదని గుర్తుంచుకోండి.
57
కఫంపై ఉన్న అపోహ
జలుబు చేసినప్పుడు పాలు తాగితే కఫం ఎక్కువవుతుందని చాలామంది నమ్ముతారు. కానీ దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పాలు కాస్త చిక్కగా ఉండటం వల్ల గొంతులో ఒక పొరలా ఏర్పడిన ఫీలింగ్ వస్తుంది తప్ప, పాలు కఫాన్ని ఉత్పత్తి చేయవు. కాబట్టి జలుబు చేసినప్పుడు కూడా మితంగా పాలు తాగడం సురక్షితమే.
67
తక్షణ శక్తికి పాలు
అనారోగ్యం నుంచి కోలుకుంటున్నప్పుడు లేదా బాగా నీరసంగా ఉన్నప్పుడు పాలు బెస్ట్ ఎనర్జీ డ్రింక్. ఇందులో ఉండే హై-క్వాలిటీ ప్రొటీన్, కాల్షియం, విటమిన్లు శరీరానికి అవసరమైన పోషణను అందిస్తాయి. జిమ్‌కు వెళ్లేవాళ్లు ఇప్పటికీ పాలను తమ ఫేవరెట్ 'పోస్ట్-వర్కౌట్' డ్రింక్‌గా తాగడానికి ఇదే కారణం.
77
చివరిగా ఒక్క మాట
అమ్మమ్మలు చెప్పిన ఈ ఇంటి చిట్కాలన్నీ కేవలం పాత నమ్మకాలు కావు, వాటి వెనుక కచ్చితమైన సైన్స్ ఉంది. ఒక గ్లాసు పాలలో పోషకాలతో పాటు ఇంట్లో వాళ్ల ప్రేమ, కేరింగ్ కూడా కలిసి ఉంటాయి. ఈ ప్రపంచ పాల దినోత్సవం నాడు, కెమికల్ డ్రింక్స్ పక్కనపెట్టి, సహజమైన పాలను మీ లైఫ్‌స్టైల్‌లో భాగం చేసుకోండి. గుర్తుంచుకోండి, అమ్మమ్మ ప్రేమ, పాల పోషణకు మించిన వెల్‌నెస్ డ్రింక్ మరొకటి లేదు.