సాధారణంగా శరీరం బాగా అలిసిపోయినప్పుడు, నిద్రలేమి కారణంగా ఆవలింతలు రావడం సహజం. కానీ ఆవలింతలు తరచూ రావడం సాధారణం కాదంటున్నారు నిపుణులు. పనిచేస్తున్నప్పుడు, ఊరికే కూర్చున్నప్పుడు ఆవలింతలు వస్తుంటే అవి కొన్ని రకాల జబ్బులకు సంకేతాలు కావచ్చని చెబుతున్నారు. మరి ఆవలింతలు ఎక్కువగా వస్తే ఎలాంటి జబ్బులు వచ్చే ప్రమాదం ఉందో ఇక్కడ తెలుసుకుందాం.
నరాల సమస్యలు
నరాలకు సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు ఎక్కువగా ఆవలింతలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. తరచూ ఆవలింతలు వస్తుంటే నిర్లక్ష్యం చేయడం ఎంతమాత్రం మంచిది కాదని సూచిస్తున్నారు.
హార్ట్ స్ట్రోక్
నిపుణుల ప్రకారం చాలా మందికి హార్ట్ స్ట్రోక్ వచ్చే ముందు కూడా అసాధారణంగా ఆవలింతలు వస్తాయట. ఆవలింతలు ఎక్కువగా వచ్చినప్పుడు ఛాతీ నొప్పి, తల తిరగడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
వైద్యుడిని సంప్రదించాలి
ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా అందరూ గుండె జబ్బుల బారిన పడుతున్నారు. కాబట్టి ఆవలింతలు ఎక్కువగా వచ్చినప్పుడు గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
కొన్ని అలవాట్లు మార్చుకోవడం ద్వారా ఆవలింతలు ఎక్కువగా రావడాన్ని తగ్గించుకోవచ్చు.
- సమయానికి నిద్రపోవాలి.
- కచ్చితంగా రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి.
- క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
- పడుకునే ముందు కెఫిన్, ఆల్కాహాల్ తీసుకోకపోవడం మంచిది.
- అతిగా తినకపోవడం మంచిది.