గురకతో ఇబ్బంది పడుతున్నారా? ఈ 5 చిట్కాలు ఫాలో అయితే గురక సమస్య మాయం!

Published : Nov 14, 2025, 06:39 PM IST

మనలో చాలామంది గురక సమస్యతో బాధపడుతుంటారు. నిజానికి గురక చిన్న సమస్యలా కనిపించినా దాన్ని నిర్లక్ష్యం చేస్తే పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో గురక సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఎలాగో ఇక్కడ చూద్దాం. 

PREV
16
గురక సమస్యకు చెక్ పెట్టే చిట్కాలు

గురక రోజువారీ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే ఆరోగ్య సమస్య. గురక పెట్టేవారికి మాత్రమే కాదు, వారి పక్కన నిద్రించే వారికి కూడా సమస్యే. సాధారణంగా నిద్రలో శ్వాసనాళాలు పాక్షికంగా మూసుకుపోవడం వల్ల గాలి సరిగ్గా అందక గురక వస్తుంది. కొన్నిసార్లు ఇది ప్రమాదకరమైన సమస్యకు సంకేతం కూడా కావచ్చు. రోజూ గురకతో బాధపడేవారు ఉదయం లేవగానే అలసటగా ఫీల్ అవుతారు. రోజంతా నిద్రమత్తు ఉంటుంది. చిరాకు పెరుగుతుంది. అంతేకాదు ఇది గుండె సంబంధిత వ్యాధులకు కూడా దారితీయవచ్చు. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఎలాగో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

26
ఒక్క పక్కకు తిరిగి పడుకోవడం

చాలామంది వెల్లకిలా పడుకుంటారు. ఇలా పడుకున్నప్పుడు శ్వాసనాళం బాగా మూసుకుపోతుంది. దీంతో గురక ఎక్కువగా వస్తుంది. కానీ ఒక పక్కకు తిరిగి పడుకొని నిద్రిస్తే శ్వాసనాళంపై ఒత్తిడి తగ్గి గాలి సులభంగా ప్రవహిస్తుంది. దానివల్ల గురక తగ్గుతుంది. కొందరు సైడుకు తిరిగి పడుకున్నా.. నిద్రలో మళ్లీ వెల్లకిలా పడుకుంటారు. కాబట్టి వెనుక భాగంలో చిన్న పిల్లో పెట్టుకొని నిద్రపోవడం మంచిది. 

36
అధిక బరువు

బరువు ఎక్కువగా ఉన్నవారిలో గొంతు చుట్టూ కొవ్వు పెరగడం వల్ల శ్వాసనాళం సన్నగా మారుతుంది. దీని వల్ల గాలి ప్రవాహం తగ్గి గురక వస్తుంది. కాబట్టి బరువు 5–10 శాతం తగ్గినా గురక గణనీయంగా తగ్గుతుంది. ప్రతిరోజూ 30 నిమిషాల పాటు వేగంగా నడవడం, యోగా, శరీరాన్ని ఫిట్‌గా ఉంచే వ్యాయామాలు గురక సమస్యను తగ్గించడంలో సహాయపడతాయి.  

46
మద్యం, ధూమపానం

మద్యం గొంతులోని కండరాలను సడలిస్తుంది. కండరాలు సడలితే శ్వాసనాళం మరింత తగ్గిపోతుంది. అలాగే ధూమపానం వల్ల గొంతులో వాపు ఏర్పడి గాలి వెళ్లే మార్గం చిన్నగా మారుతుంది. ఈ కారణాల వల్ల గురక పెరుగుతుంది. కాబట్టి మద్యం, ధూమపానం మానేయడం మంచిది. లేదా కనీసం పడుకునే 3–4 గంటల ముందు ఈ రెండు అలవాట్లకు దూరంగా ఉండడం ఉత్తమం.  

56
ఆవిరి పట్టడం

కొంతమంది ముక్కు దిబ్బడ వల్ల గురక పెడుతుంటారు. జలుబు, అలర్జీలు, సైనస్ సమస్యలు గురక రావడానికి కారణమవుతాయి. సాధారణంగా ముక్కు బ్లాక్ అయితే నోటితో శ్వాస తీసుకోవాల్సి వస్తుంది. దానివల్ల గురక పెరుగుతుంది. కాబట్టి పడుకునే ముందు ఆవిరి పట్టడం మంచిది. 

66
ఒకే టైంకి నిద్రపోవడం

టైంకి నిద్రపోకపోవడం, తక్కువ నిద్ర, అలసట వంటివి కూడా గురకకు కారణమవుతాయి. కాబట్టి రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. కనీసం 7–8 గంటలు నిద్రపోవాలి. పడుకునే ముందు మొబైల్, ల్యాప్‌టాప్‌ల వాడకం తగ్గించడం, కాఫీ లేదా టీ తాగకుండా ఉండటం, గదిని ప్రశాంతంగా ఉంచుకోవడం వంటివి నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories