గోళ్లు కొరకడం చాలా మందికి ఉండే కామన్ అలవాటు. దీనిని చాలా మంది చాలా తేలికగా తీసుకుంటారు. కానీ గోళ్లు కొరకే అలవాటు ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అది మానసికంగానూ, శారీరకంగానూ చాలా సమస్యలను తెచ్చి పెడుతుంది.
మనలో చాలా మంది గోళ్లు కొరికే అలవాటు ఉంటుంది. టెన్షన్ ఎక్కువైనప్పుడు, ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు గోళ్లు కొరికేస్తూ ఉంటారు. పెరిగిన నెయిల్స్ ని కట్ చేయడానికి నెయిల్ కట్టర్ ఉన్నా కూడా.. గోళ్లు కొరికి ఎక్కడ పడితే అక్కడ ఊస్తూ ఉంటారు.చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఈ అలవాటు ఉంటుంది. వైద్యపరంగా దీనిని ఒనికోఫాగియా అనే ఫోబియా అని కూడా చెప్పొచ్చు. దీనిలో ఏముందిలే అని చాలా మంది అనుకుంటారు. కానీ, దీని వల్ల చాలా రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉందంట. శారీరకంగానూ, మానసికంగానూ చాలా ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. ఇన్ఫెక్షన్ల నుంచి దంత సమస్యల వరకు చాలా ఆరోగ్య సమస్యలను తెస్తుంది.
24
nail
ఇన్ఫెక్షన్ల ప్రమాదం:
మన కంటికి కనిపించని సూక్ష్మ క్రిములు చాలా చేతులకు ప్రతిరోజూ అంటుకుంటూ ఉంటాయి. మనం గోళ్లు కొరకడం వల్ల ఈ బాక్టీరియా మన నోటిలోకి నేరుగా ప్రవేశిస్తుంది. దీని వల్ల హానికరమైన సూక్ష్మ క్రిములు కడుపులో వెళ్లడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి.
దంతాలు, చిగుళ్ళకు నష్టం:
గోళ్లు ఎక్కువగా కొరకడం వల్ల దంతాలపై ఒత్తిడి ఏర్పడుతుంది. దవడ నొప్పి రావడం లాంటి సమస్య వస్తుంది. దంతాలపై ఉండే ఎనామిల్ పొర పోతుంది. కావిటీస్ ప్రమాదం పెరుగుతుంది. ఇన్ఫెక్షన్ల సమస్య ఎక్కువ అవుతుంది.
34
చర్మం,గోళ్లు దెబ్బతినడం:
నిరంతరం గోళ్లు కొరకడం వల్ల గోర్లు చిన్నగా మారడమే కాకుండా చుట్టుపక్కల చర్మాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఇది రక్తస్రావం, శాశ్వతంగా గోళ్లు డ్యామేజ్ అవ్వడానికి కారణం అవుతుంది. గోరు రంగు మారిపోతుంది..ఒక్కోసారి గోళ్లు మళ్లీ పెరగవు కూడా.
మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది:
చాలా మంది ఒత్తిడి, ఆందోళన లేదా విసుగు కారణంగా తమ గోళ్లను కొరుకుతారు, కానీ ఈ అలవాటు ప్రతికూల భావనలను పెంచుతుంది. చివరకు మానసికంగా మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అవకాశం కూడా ఉంది.
44
గోళ్లను కొరకడం ఎలా ఆపాలి?
వీలైనంత వరకు గోళ్లను కొరకకుండా కంట్రోల్ చేసుకోవాలి. మీ గోళ్లను అందంగా కత్తిరించుకోవాలి. నెయిల్ పాలిష్ వేసుకోవాలి. అప్పుడు తొందరగా గోళ్లు కొరకలేరు.